Hyderabad: ప్రముఖ నిర్మాత సంస్థ ముందు ఓ యువతి అర్ధనగ్న ప్రదర్శన.. సినీ నిర్మాత పెళ్లి చేసుకోవాలని డిమాండ్

మలక్‌పేటకు చెందిన బోయ సునీత అనే జూనియర్‌ ఆర్టిస్టు సోమవారం తెల్లవారుజామున గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు.. అర్ధ నగ్న ప్రదర్శన తో తన నిరసన తెలిపేందుకు ప్రయత్నించింది. ఓ సినీ నిర్మాత పై సంచలన ఆరోపణలు చేసింది..

Hyderabad: ప్రముఖ నిర్మాత సంస్థ ముందు ఓ యువతి అర్ధనగ్న ప్రదర్శన.. సినీ నిర్మాత పెళ్లి చేసుకోవాలని డిమాండ్
Hyderabad
Follow us
Surya Kala

|

Updated on: May 10, 2022 | 5:40 PM

Hyderabad: జూబ్లీహిల్స్ లోని (Jubilee Hills) ప్రముఖ నిర్మాణ సంస్థ ఆఫీస్ఎదుట సోమవారం తెల్లవారు జామున హై డ్రామా నెలకొంది. తనకు ఓ సినీ నిర్మాత  అన్యాయం చేశాడని.. తనకు న్యాయం చేయమంటూ.. ఓ జూనియర్ ఆర్టిస్టు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 45లోని గీతా ఆర్ట్స్‌ (Geeta Arts office) కార్యాలయం ముందు  అర్ధనగ్న ప్రదర్శనకు దిగింది. తనను సినీ నిర్మాత పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు.. తనకు డబ్బులు రావాలని.. ఎన్ని సార్లు అడిగినా ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ యువతికి బట్టలు తొడిగి అదుపులోకి తీసుకున్నారు.. వివరాలలోకి వెళ్తే..

మలక్‌పేటకు చెందిన బోయ సునీత అనే జూనియర్‌ ఆర్టిస్టు సోమవారం తెల్లవారుజామున గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు.. అర్ధ నగ్న ప్రదర్శన తో తన నిరసన తెలిపేందుకు ప్రయత్నించింది. తనకు జరిగిన అన్యాయంపై సినీ పరిశ్రమ స్పందించి న్యాయం చేయాలని సునీత డిమాండ్ చేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న మహిళా పోలీసులు ఆమెకు దుస్తులు తొడిగారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే బోయ సునీత నిరసన కార్యక్రమం చేపట్టిన సమయంలో ఆఫీస్ లో ఎవరూ లేరు. ప్రస్తుతం పోలీసులు బోయ సునీత పై మానసిక స్థితి చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే బోయ సునీత ఇప్పటికే పలుమార్లు సదరు సినీ నిర్మాతపై ఆరోపణలు చేసింది. గత ఏడాది జూలై లో కూడా  గీతా ఆర్ట్స్‌  ఆఫీసు ముందు ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళనకు చేపట్టిన సంగతి తెలిసిందే. బోయ సునీత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల   కోసం ఇక్కడ క్లిక్ చేయండి