Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: మెగాస్టార్‌ గాడ్‌ ఫాదర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్సయిందా? ఆరోజే రానుందంటూ జోరుగా ఊహాగానాలు..

God Father Release Date: ఇప్పటికే చాలావరకు షూటింగ్‌ పూర్తి చేసుకున్న గాడ్‌ఫాదర్‌ చిత్రంపై ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ రిలీజ్‌ డేట్‌పై చిత్ర బృందం ప్రస్తుతం చర్చలు జరుపుతోందని, అన్నీ కుదిరితే ఆగస్టులోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

Megastar Chiranjeevi: మెగాస్టార్‌ గాడ్‌ ఫాదర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్సయిందా? ఆరోజే రానుందంటూ జోరుగా ఊహాగానాలు..
God Father
Follow us
Basha Shek

|

Updated on: May 10, 2022 | 4:02 PM

God Father Release Date: ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తోన్న చిత్రం గాడ్‌ ఫాదర్‌ (God Father). మలయాళం సూపర్‌ హిట్‌ పొలిటికల్‌ థ్రిల్లర్‌ లూసీఫర్‌ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో హనుమాన్‌ జంక్షన్‌ లాంటి హిట్‌ సినిమాను అందించిన మోహన్‌ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండా.. బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ స్పెషల్ కామియో రోల్‌లో కనిపించనున్నాడు. వీరితో పాటు టాలీవుడ్‌ మాస్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌, సత్యదేవ్‌, గంగవ్వ తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌పై ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇప్పటికే చాలావరకు షూటింగ్‌ పూర్తి చేసుకున్న గాడ్‌ఫాదర్‌ చిత్రంపై ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ రిలీజ్‌ డేట్‌పై చిత్ర బృందం ప్రస్తుతం చర్చలు జరుపుతోందని, అన్నీ కుదిరితే ఆగస్టులోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ఆగస్టు 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

కాగా గాడ్‌ ఫాదర్‌ సినిమాకు తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. నిరవ్‌ షా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆచార్యతో మిశ్రమ ఫలితం అందుకున్న మెగాస్టార్‌ ఈ సినిమాతో మరోసారి సూపర్‌ హిట్‌ అందుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే సెట్స్ మీదున్న మూడు చిత్రాలలో ముందు గాడ్ ఫాదర్ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇవి కాకుండా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో భోళా శంకర్‌, కే.ఎస్‌. రవీంద్ర డైరెక్షన్‌లో మరోక సినిమాలో షూటింగ్‌లోనూ మెగాస్టార్‌ తలమునకలై ఉన్నారు. వీటితో పాటు వెంకీ కుడుముల సినిమాకు కూడా ఓకే చెప్పారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also read: 

Agent Movie: అఖిల్‌ సినిమా మరోసారి వాయిదా పడనుందా.. గాడ్‌ ఫాదర్‌ కోసం వెనక్కి తగ్గనున్నాడా.?

Beast OTT: డిజిటల్‌ స్ర్కీన్‌పై యాక్షన్‌ ఫీస్ట్‌ అందించేందుకు సిద్ధమైన బీస్ట్‌.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి విజయ్‌ సినిమా.. ఎక్కడంటే..

Harish Rao: అబద్ధాల్లో బీజేపీకి నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వచ్చు.. ఆ రెండు పార్టీలు తెలంగాణకు హానికరం: మంత్రి హరీశ్‌