AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rao: అబద్ధాల్లో బీజేపీకి నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వచ్చు.. ఆ రెండు పార్టీలు తెలంగాణకు హానికరం: మంత్రి హరీశ్‌

TS Politics: టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల గుండెల నుంచి పుట్టిన పార్టీ అని, మమ్మల్ని ఒంటరిగా ఎదుర్కోలేకే ఈ రెండు పార్టీలు కలిసి కుట్రలు పన్నుతున్నాయని హరీశ్‌ ధ్వజమెత్తారు.

Harish Rao: అబద్ధాల్లో బీజేపీకి నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వచ్చు.. ఆ రెండు పార్టీలు తెలంగాణకు హానికరం: మంత్రి హరీశ్‌
Harish Rao
Basha Shek
|

Updated on: May 10, 2022 | 3:31 PM

Share

TS Politics: బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అని, అబద్ధాల్లో ఆ పార్టీకి నోబెల్ ప్రైజ్‌ ఇచ్చినా సరిపోదని రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. బీజేపీతో పాటు కాంగ్రెస్‌ కూడా తెలంగాణకు హాని చేసే పార్టీలేనని మంత్రి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల గుండెల నుంచి పుట్టిన పార్టీ అని, మమ్మల్ని ఒంటరిగా ఎదుర్కోలేకే ఈ రెండు పార్టీలు కలిసి కుట్రలు పన్నుతున్నాయని హరీశ్‌ ధ్వజమెత్తారు. కాగా మహబూబాబాదు జిల్లా ప్రధాన ఆస్పత్రి నూతన భవనానికి, రు. 510 కోట్లతో నిర్మించబోతున్న మెడికల్ కాలేజీకి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. అంతకుముందు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రేడియాలజీ సేవల భవనం, 41 పడకల జనరల్ వార్డ్, డెడికేటెడ్ పీడియాట్రిక్ కేర్ యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌ కమలం, కాంగ్రెస్‌ పార్టీలపై నిప్పులు కురిపించారు.

ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వసతులు..

‘మహబూబాద్ జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ వచ్చింది కాబట్టే మాను కోట జిల్లాగా మారింది. ఇప్పుడు మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసుకున్నాం.రూ. 550 కోట్ల తో మెడికల్ కాలేజి శంకుస్థాపన చేయడం చిన్న విషయమేమీ కాదు. 75 ఏళ్ల పాటు కాంగ్రెస్,టీడీపీలు తెలంగాణను పాలించాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ లో మాత్రమే 3 మెడికల్ కాలేజీలు వచ్చాయి. వచ్చాయి. కాన గత ఏడేళ్లలో 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎంకేసీఆర్‌ కే దక్కుతుంది. మహబూబాద్ లో వంద పడకల ఆసుపత్రి ఉండేది. పది మంది డాక్టర్లు ఉండేవారు. ఇప్పుడు ఆస్పత్రి 650 పడకలకు పెరగనుంది. వంద మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు. మరిపెడ ఆసుపత్రిని కూడా అప్ గ్రేడ్ చేస్తాం. పల్లె దవాఖానా నర్సింహపెటలో అందుబాటులో తీసుకొస్తాం. బలపాల పీహెచ్‌సీకి బిల్డింగ్ లేదంటున్నారు. దానికి 2 కోట్ల 20 లక్షలు మంజూరు చేస్తం.తొర్రూరు ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం. పెద్ద వంగరలో పల్లే దవాఖానా అడిగారు. దాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తాం’

ఇవి కూడా చదవండి

ఆ పార్టీలు తెలంగాణకు హానికరం..

’75 ఏళ్లకో కాని పనులు, ఈ ఏడేళ్లలో జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌, ఏపీలో 6 గంటల పాటు కోతలున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు పోతోంది. కాని మహబూబాద్ మారుమూల తండాలో 24 గంటల కరెంట విద్యుత్‌ సరఫరా ఉంది. దేశంలో 24 గంటల పాటు కరెంటు ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మొన్న నడ్డా తెలంగాణకు వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ఒక్క ఎకరానికి రాలేదన్నారు. అదేవిధంగా బీజేపీ వాళ్లు ఒక్క ఎకరానికి కూడా నీళ్లు వచ్చాయా? అని అడుగుతున్నారు. వీటికి సమాధానాలు మా రైతులే చెబుతారు. బీజేపీ వాళ్లు చెప్పేవి పచ్చి అబద్ధాలు. అబద్ధాల్లో ఆ పార్టీకి నోబెల్ ప్రైజ్ ఇచ్చినా సరిపోదు. కాళేశ్వరం నీరు రాలేదంటే ఇంతకన్న జూటా మాట ఉంటదా. పథకాలకు పైసలన్నీ కేంద్రమే ఇస్తుందంటున్నారు. ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు పది వేల రూపాయలు ఇస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు పని చేసే పార్టీ. ఈ జాతీయపార్టీలు తెలంగాణకు హని చేస్తున్నాయి. తెలంగాణకు పని చేసే పార్టీలు ఉండాలా.. హాని చేసే పార్టీలు ఉండాలా? అన్నది ప్రజలే తేల్చుకోవాలి’

ఒంటరిగా ఎదుర్కోలేకే కుట్రలు..

‘కాంగ్రెస్ నాయకులు పాలమూరు ప్రాజెక్టు కట్టవద్దని కేసులు వేస్తున్నారు. బీజేపీ వాళ్లు కాళేశ్వరం ఆపాలని కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. మిషన్ భగీరథ పనులు ఆపాలని, ఎంక్వైరీ చేయాలని ఉత్తరాలు రాస్తున్నారు. వీరు ఏమీ చేయరు. కానీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తోన్న టీఆర్ఎస్ పార్టీని మాత్రం అడ్డుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో పార్టీ. జాతీయ పార్టీలు వికృత పార్టీలు. ఇవి తెలంగాణకు అన్యాయం చేసిందే తప్ప మేలు చేసిందేమీ లేదు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేక కాంగ్రెస్ బీజేపీలు కుట్రలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే హై కమాండ్, టీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష’ అని హరీశ్‌ రావు పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Beast OTT: డిజిటల్‌ స్ర్కీన్‌పై యాక్షన్‌ ఫీస్ట్‌ అందించేందుకు సిద్ధమైన బీస్ట్‌.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి విజయ్‌ సినిమా.. ఎక్కడంటే..

Nandamuri Family: నటుడిగా ఎదుగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి ఫ్యామిలీ హీరో ఎవరో గుర్తుపట్టారా?