Beast OTT: డిజిటల్‌ స్ర్కీన్‌పై యాక్షన్‌ ఫీస్ట్‌ అందించేందుకు సిద్ధమైన బీస్ట్‌.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి విజయ్‌ సినిమా.. ఎక్కడంటే..

Beast OTT: ఏప్రిల్‌ 13న తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలైంది. ఓ షాపింగ్‌ మాల్‌ను టెర్రరిస్ట్‌లు హైజాక్‌ చేస్తే, అందులో ఉన్న ప్రజలను రా ఏజెంట్‌ ఎలా రక్షించాడన్న ఆసక్తికర కథాంశంతో బీస్ట్‌ సినిమాను తెరకెక్కించారు.

Beast OTT: డిజిటల్‌ స్ర్కీన్‌పై యాక్షన్‌ ఫీస్ట్‌ అందించేందుకు సిద్ధమైన బీస్ట్‌.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి విజయ్‌ సినిమా.. ఎక్కడంటే..
Beast Movie
Follow us
Basha Shek

|

Updated on: May 10, 2022 | 2:48 PM

Beast OTT: కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ ( Vijay Thalapathy) హీరోగా తెరకెక్కిన చిత్రం బీస్ట్‌ (Beast) . నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఏప్రిల్‌ 13న తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలైంది. తమిళంలో భారీ కలెక్షన్లను రాబట్టినప్పటికీ ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో బీస్ట్‌ ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా విడుదలైనప్పుడే కేజీఎఫ్‌ చిత్రం విడుదల కావడం, ఆ సినిమాకు దేశ వ్యాప్తంగా సూపర్‌ హిట్‌ టాక్‌ రావడంతో బీస్ట్‌ వసూళ్లపై ప్రతికూల ప్రభావం పడింది. అయితే విజయ్‌ ఫ్యాన్స్‌కు మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది. ముఖ్యంగా ఇందులోని పాటలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఓ షాపింగ్‌ మాల్‌ను టెర్రరిస్ట్‌లు హైజాక్‌ చేస్తే, అందులో ఉన్న ప్రజలను రా ఏజెంట్‌ ఎలా రక్షించాడన్న ఆసక్తికర కథాంశంతో బీస్ట్‌ సినిమాను తెరకెక్కించారు.

కాగా సిల్వర్‌ స్ర్కీన్‌పై సందడి చేసిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మరికొన్ని గంటల్లో డిజిటల్ స్క్రీన్‌ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థలైన స‌న్ ఎన్ఎక్స్‌టీ (Sun NXT), నెట్‌ఫ్లిక్స్‌లలో ఈరోజు అర్ధరాత్రి 12గంట‌ల నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు కన్నడ, తెలుగు, మలయాళ వెర్షన్లు అన్ని ఒకేసారి సన్ నెక్ట్‌లో ప్రసారం కానున్నాయి. అయితే హిందీ వెర్షన్‌ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా బీస్ట్‌ సినిమాకు అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు. ఇవి విజయ్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read: 

Ind Vs Aus: ఆస్ట్రేలియాతో తలపడునున్న రోహిత్ సేన.. IPL తర్వాత టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే..

Rainbow Childrens Medicare: నష్టాలను మిగిల్చిన రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ ఐపీఓ.. 6 శాతం తక్కువతో లిస్టింగ్‌..

Weather In AP & TS: డేంజర్‌లో ఏపీ, తెలంగాణ ప్రజలు.. భారత వాతావరణ శాఖ వార్నింగ్‌..