Rainbow Childrens Medicare: నష్టాలను మిగిల్చిన రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ ఐపీఓ.. 6 శాతం తక్కువతో లిస్టింగ్..
రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ (Rainbow Childrens Medicare) స్టాక్ మార్కెట్‌లో లిస్టయింది. కంపెనీ షేరు బీఎస్‌ఈలో 6.64 శాతం తగ్గింపుతో రూ.506 వద్ద లిస్టైంది. ఎన్‌ఎస్‌ఈలో రూ.510 వద్ద లిస్టైంది...
రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ (Rainbow Children’s Medicare) స్టాక్ మార్కెట్‌లో లిస్టయింది. కంపెనీ షేరు బీఎస్‌ఈలో 6.64 శాతం తగ్గింపుతో రూ.506 వద్ద లిస్టైంది. ఎన్‌ఎస్‌ఈలో రూ.510 వద్ద లిస్టైంది. రెయిన్‌బో చిల్డ్రన్ మెడికేర్ ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ.542గా ఉంది. స్టాక్ బలహీనమైన లిస్టింగ్ కారణంగా ఇన్వెస్టర్లు నష్టపోయారు. పెట్టుబడిదారుడు ఒక షేరుపై రూ.36 నష్టపోయాడు. ఈ IPO ఏప్రిల్ 27న ప్రారంభమైంది. ఏప్రిల్ 29న ముగిసింది. ఈ ఇష్యూకు నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (NII), రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సరైన స్పందన రాలేదు. లిస్టింగ్ తర్వాత రెయిన్‌బో చిల్డ్రన్ మెడికేర్ స్టాక్ రూ.480.80 కనిష్ట స్థాయికి దిగజారింది. ప్రస్తుతం, ఈ షేరు బిఎస్‌ఇలో ఇష్యూ ధరతో పోలిస్తే 10.17 శాతం తగ్గి రూ.486.90 స్థాయిలో ట్రేడవుతోంది.
ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,581 కోట్లు సమీకరించింది. ఇందులో రూ.280 కోట్లు రుణం చెల్లింపు, కొత్త ఆసుపత్రి నిర్మాణానికి వెచ్చించనున్నారు. షేర్లను విక్రయించే వాటాదారులకు రూ.1,300.8 కోట్లు లభిస్తాయి. రెయిన్‌బో చిల్డ్రన్ మెడికేర్ తన ఉద్యోగుల కోసం ఇష్యూలో 3 లక్షల షేర్లను రిజర్వ్ చేసింది. ఇష్యూలో పాల్గొన్న ఉద్యోగులు తుది ఆఫర్ ధరలో ఒక్కో షేరుకు రూ.20 తగ్గింపును పొందారు. IPO కింద, 280 కోట్ల రూపాయల విలువైన కొత్త ఈక్విటీ షేర్లు జారీ చేశారు. బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ PSC-మద్దతుగల గ్రూప్ దక్షిణ భారతదేశంలో 14 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. దీని మొత్తం పడకల సామర్థ్యం 1500గా ఉంది. దీని ప్రధాన ప్రత్యేకతలు పీడియాట్రిక్, ఇందులో నియోనాటల్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్, పీడియాట్రిక్ మల్టీ-స్పెషాలిటీ సర్వీసెస్, పీడియాట్రిక్ క్వాటర్నరీ కేర్ (మల్టీ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్‌తో సహా) ఉన్నాయి. ఇది ప్రసూతి, గైనకాలజీని కూడా కలిగి ఉంటుంది.
Read Also.. Petrol Diesel Prices: వాహనదారులకు ఊరట.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు