AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inflation: కలవరపెడుతోన్న ద్రవ్యోల్బణం.. 18 నెలల గరిష్ఠానికి చేరుకునే అవకాశం..

దేశంలో ద్రవ్యోల్బణం(Inflation) రోజురోజుకి పెరుగుతోంది. మార్చి నెలలో ఇది 6.95 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం రాయిటర్స్ సర్వే ప్రకారం ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.5 శాతానికి చేరే అవకాశం ఉంది...

Inflation: కలవరపెడుతోన్న ద్రవ్యోల్బణం.. 18 నెలల గరిష్ఠానికి చేరుకునే అవకాశం..
Inflation
Srinivas Chekkilla
|

Updated on: May 11, 2022 | 6:00 AM

Share

దేశంలో ద్రవ్యోల్బణం(Inflation) రోజురోజుకి పెరుగుతోంది. మార్చి నెలలో ఇది 6.95 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం రాయిటర్స్ సర్వే ప్రకారం ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.5 శాతానికి చేరే అవకాశం ఉంది. ఇది 18 నెలల గరిష్ట స్థాయి. ఇంధన ధరల పెరుగుదల, ఆహార ద్రవ్యోల్బణం(Food Inflation) పెరుగుదల కారణంగా, రిటైల్ ద్రవ్యోల్బణంపై ఒత్తిడి నిరంతరం పెరుగుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా దాదాపు నాలుగైదు నెలలుగా పెట్రోల్(Petrol), డీజిల్ ధరలు మారలేదు. మార్చి 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగా.. మార్చి 22 నుంచి ధరల పెంపు ప్రారంభమైంది. ఏప్రిల్ 6 నాటికి పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.10 పెరిగింది. ఖరీదైన పెట్రోల్, డీజిల్ కారణంగా, రవాణా ఖర్చు గణనీయంగా పెరిగింది. దీని ప్రభావం ప్రతిచోటా కనిపించింది. ఇంతలో ఫిబ్రవరి చివరిలో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. ఇది ప్రపంచ మార్కెట్లో ఇంధన సంక్షోభాన్ని సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలలో విపరీతమైన పెరుగుదల కనిపించింది.

ఇంధనం, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం కనిపిస్తోందని క్యాపిటల్ ఎకనామిక్స్‌కు చెందిన ఆర్థికవేత్త షిలాన్ షా అన్నారు. CPI ఇండెక్స్‌లో ఆహార ద్రవ్యోల్బణం సహకారం దాదాపు 50 శాతానికి దగ్గరగా ఉంది. ప్రస్తుతం ఆహార ద్రవ్యోల్బణం కొన్ని నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతి చేసుకుంటోంది. ఇక్కడ డాలర్‌తో రూపాయి మారకం విలువ అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి విలువ 4 శాతం క్షీణించింది. అటువంటి పరిస్థితిలో వాణిజ్య లోటు పెరుగుదల కారణంగా రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. టోకు ద్రవ్యోల్బణం 14.48 శాతంగా అంచనా వేశారు. మార్చి నెలలో ఇది 14.55 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ తాజాగా రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది.

Read Also.. Adani Green: అద్బుతాలు సృష్టిస్తున్న అదానీ గ్రీన్ స్టాక్.. మార్కెట్ క్యాప్ లో SBIని వెనక్కి నెట్టిన సంస్థ..