Drone Pilots: 12వ తరగతి ఉత్తీర్ణులైనవారికి డ్రోన్ పైలట్ శిక్షణ..! నెలకు రూ. 30,000 జీతం..!

కేంద్ర ప్రభుత్వం డ్రోన్(Drone) సేవలు పెంచడానికి ప్రయత్నిస్తుందని.. రాబోయే సంవత్సరాల్లో దేశానికి సుమారు లక్ష మంది డ్రోన్ పైలట్లు(Drone Pilots) అవసరమవుతాయని విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Scindia) మంగళవారం తెలిపారు...

Drone Pilots: 12వ తరగతి ఉత్తీర్ణులైనవారికి డ్రోన్ పైలట్ శిక్షణ..! నెలకు రూ. 30,000 జీతం..!
Drone
Follow us

|

Updated on: May 10, 2022 | 6:08 PM

కేంద్ర ప్రభుత్వం డ్రోన్(Drone) సేవలు పెంచడానికి ప్రయత్నిస్తుందని.. రాబోయే సంవత్సరాల్లో దేశానికి సుమారు లక్ష మంది డ్రోన్ పైలట్లు(Drone Pilots) అవసరమవుతాయని విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Scindia) మంగళవారం తెలిపారు. “మేము డ్రోన్ రంగాన్ని మూడు దఫాల్లో ముందుకు తీసుకెళ్తున్నాము. మొదటి దఫా విధానానికి సంబంధించినది. మేము పాలసీని ఎంత వేగంగా అమలు చేస్తున్నామో మీరు చూశారు” అని నీతి ఆయోగ్ కార్యక్రమంలో సింధియా అన్నారు. ప్రోత్సాహకాలను సృష్టించడమే రెండో దఫా అన్నారు. “ప్రధానమంత్రి నాయకత్వంలో అమలు చేస్తున్న PLI (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) పథకం డ్రోన్ సెక్టార్‌లో తయారీ, సేవలకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది” అని ఆయన చెప్పారు.

ఆగస్టు 25, 2021న మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సరళీకృత డ్రోన్ రూల్స్, 2021 ఫాలో-త్రూగా సెప్టెంబర్ 2021లో PLI పథకం వచ్చింది. స్వదేశీ డిమాండ్‌ను సృష్టించడం మూడవ దఫా అని సింధియా చెప్పారు. ఈ డిమాండ్ సృష్టించడానికి.. 12వ తరగతి ఉత్తీర్ణులై డ్రోన్ పైలట్ శిక్షణ పొందవచ్చని, కాలేజీ డిగ్రీలు అవసరం లేదని తెలిపారు. “2-3 నెలల శిక్షణతో, ఈ వ్యక్తి నెలకు రూ. 30,000 జీతంతో డ్రోన్ పైలట్‌గా మారొచ్చని. రాబోయే సంవత్సరాల్లో మనకు దాదాపు లక్ష మంది డ్రోన్ పైలట్లు కావాలి.” అని సింధియా చెప్పాడు. 2026 నాటికి భారత డ్రోన్ పరిశ్రమ మొత్తం టర్నోవర్ రూ.15,000 కోట్ల వరకు ఉంటుందని సింధియా గత ఏడాది సెప్టెంబర్ 16న చెప్పారు.

Read Also.. LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓకు దరఖాస్తు చేశారా.. అయితే షేర్లు వచ్చాయో లేదో ఇలా తెలుసుకోండి..