LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓకు దరఖాస్తు చేశారా.. అయితే షేర్లు వచ్చాయో లేదో ఇలా తెలుసుకోండి..
ఎల్‌ఐసీ ఐపీఓ(LIC IPO)కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఇష్యూ 2.95 రెట్లు సబ్‌స్ర్కైబ్ అయింది. ఎన్‌ఐఐల(NII)కు మొత్తం 2,96,48,427 షేర్లు కేటాయించగా.. 3,06,73,020 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్స్ఛేంజీల వద్ద లభించిన సమాచారం ద్వారా తెలిసింది...
ఎల్‌ఐసీ ఐపీఓ(LIC IPO)కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఇష్యూ 2.95 రెట్లు సబ్‌స్ర్కైబ్ అయింది. ఎన్‌ఐఐల(NII)కు మొత్తం 2,96,48,427 షేర్లు కేటాయించగా.. 3,06,73,020 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్స్ఛేంజీల వద్ద లభించిన సమాచారం ద్వారా తెలిసింది. మొత్తం ఈ కోటాలో 1.03 రెట్లు స్పందన వచ్చింది. మొత్తంగా ఐపీఓకు 1.59 సబ్‌స్క్రైబ్ అయ్యారు. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల (QIB) కోటాకు మాత్రం ఇంకా స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఈ కోటా కేవలం 67 శాతం దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక రిటైల్ ఇన్వెస్టర్ల కోటాకు మొత్తం 6.9 కోట్ల షేర్లు కేటాయించగా.. 1.38 రెట్లు స్పందన వచ్చింది. మొత్తం 9.57 కోట్ల దరఖాస్తులు దాఖలయ్యాయి. పాలసీ హోల్డర్ల వాటాకు ఏకంగా 4.4 రెట్లు స్పందన లభించింది. ఉద్యోగుల కోటాకు 3.4 రెట్లు స్పందన వచ్చింది.
LIC IPO కోసం దరఖాస్తు చేసిన వారికి షేర్లు వచ్చాయో లేదో ఎలా తెలుస్తుంది. షేర్లు కేటాయింపు జరగాలంటే మే 12 వరకు ఆగాల్సిందే.. ఆ తర్వాత BSE వెబ్‌సైట్‌లో షేర్లు కేటాయించారో లేదో తెలుసుకోవచ్చు. ముందుగా BSE www.bseindia.com అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత ‘ఈక్విటీ’ని సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత డ్రాప్‌డౌన్‌లో ‘LIC IPO’ని ఎంచుకోవాలి. దీని తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీరు మీ అప్లికేషన్ నంబర్, పాన్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయాలి. LIC IPO షేర్ల కేటాయింపు జరిగిందో లేదో తెలుస్తుంది. మీకు ఐపీఓలో షేర్లు కేటాయింపు జరిగితే డీమ్యాట్ ఖాతాలోకి మే 16న షేర్లు జమ అవుతాయి. ఎల్‌ఐసీ మే 17న స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవుతుంది.
Read also.. RBI Penalty: ఈ రెండు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. నిబంధనలు పాటించడం లేదని భారీ జరిమానా