Weather In AP & TS: డేంజర్‌లో ఏపీ, తెలంగాణ ప్రజలు.. భారత వాతావరణ శాఖ వార్నింగ్‌..

Weather In AP & TS: డేంజర్‌లో ఏపీ, తెలంగాణ ప్రజలు.. భారత వాతావరణ శాఖ వార్నింగ్‌..

|

Updated on: May 10, 2022 | 1:45 PM

ఇళ్ల నుంచి బయటికి వెళ్తున్నారా? అయితే జాగ్రత్త.! అయితే, మీ ప్రాణాలకు మీరే బాధ్యులు. ఎందుకంటే AP, తెలంగాణ ప్రజలంతా ఇప్పుడు డేంజర్‌లో ఉన్నారు. అవును, ఇది నిజం. ఇది మేం చెబుతోన్న మాట కాదు. స్వయంగా భారత వాతావరణశాఖ చేస్తోన్న వార్నింగ్‌.

ఇళ్ల నుంచి బయటికి వెళ్తున్నారా? అయితే జాగ్రత్త.! అయితే, మీ ప్రాణాలకు మీరే బాధ్యులు. ఎందుకంటే AP, తెలంగాణ ప్రజలంతా ఇప్పుడు డేంజర్‌లో ఉన్నారు. అవును, ఇది నిజం. ఇది మేం చెబుతోన్న మాట కాదు. స్వయంగా భారత వాతావరణశాఖ చేస్తోన్న వార్నింగ్‌. తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అండ్‌ రెడ్‌ వార్నింగ్‌ కంటిన్యూ అవుతోంది. అత్యవసరమైతే తప్ప, మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటికి రావొద్దని వాతావరణశాఖ చెబుతోంది. ఏపీ, తెలంగాణ… రెండు రాష్ట్రాల్లోనూ భానుడు భగభగ మండిపోతున్నాడు. ఉదయం ఏడు గంటలకే నిప్పులు కక్కుతున్నాడు. మార్నింగ్‌ పది దాటిందంటే చాలు నడినెత్తిన మంట పెట్టినట్టు పొగలు రేపుతున్నాడు.ఎండలకి తోడు, వడగాలులు కూడా ఊహించని స్థాయిలో ఉంటాయని హెచ్చరిస్తోంది భారత వాతావరణశాఖ. మే నెలలో ఎండరు మరింత పెరుగుతాయని, రాత్రుళ్లు సైతం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హిచ్చరించింది. ఏపీ, తెలంగాణ… రెండు రాష్ట్రాల్లోనూ రికార్డుస్థాయిలో టెంపరేచర్స్‌ నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌, మెదక్‌, నల్గొండ, నిజామాబాద్‌, రామగుండంలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇటు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతున్నాయ్‌. ఉదయం 8గంటలకే వేడి గాలులు బెంబేలెత్తిస్తున్నాయ్‌. ఇక, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అయితే ఉడికిపోతోంది. భానుడి ప్రతాపానికి ప్రజలు ప్రాణాలు వదిలేస్తున్నారు. తిరుమలలో కూడా ఎండలు మండిపోతున్నాయ్‌. దాంతో భక్తుల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది టీటీడీ. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం భానుడి భగభగలతో మండిపోతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో టెంపరేచర్స్‌ రికార్డవుతున్నాయ్‌. ఉత్తరాది రాష్ట్రాల్లో 50 డిగ్రీలకు చేరాయి ఉష్ణోగ్రతలు. ఢిల్లీ, యూపీ, రాజస్థాన్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Funny Viral video: సమ్మర్‌లో సూపర్‌ టెక్నిక్‌.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!

Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Follow us
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే