Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Family: నటుడిగా ఎదుగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి ఫ్యామిలీ హీరో ఎవరో గుర్తుపట్టారా?

ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కుటుంబ సభ్యులు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు. త్రివిక్రమరావు చిన్న కుమారుడు హరీన్ చక్రవర్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

Nandamuri Family: నటుడిగా ఎదుగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి ఫ్యామిలీ హీరో ఎవరో గుర్తుపట్టారా?
Nandamuri Hareen
Follow us
Surya Kala

|

Updated on: May 10, 2022 | 2:54 PM

Nandamuri Family: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్పెషల్ గుర్తింపు సొంతం చేసుకున్న ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ.. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందుకున్న ఆయన కుమారులు బాలకృష్ణ స్టార్ హీరోగా క్రేజ్ ను సొంతం చేసుకుంటే.. హరికృష్ణలు నటుడుగా తనదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇక నందమూరి మూడో తరం వారసులుగా ఎన్టీఆర్ మనవళ్లు చైతన్య కృష్ణ, తారక రత్న, ఎన్టీఆర్ లు వెండి తెరపై అడుగు పెట్టారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కూడా చిత్ర పరిశ్రమలో నిర్మాతగా కొనసాగారు. ఆయన తనయులు కళ్యాణ్ చక్రవర్తి,  హరీన్ చక్రవర్తిలు కూడా సినీ పరిశ్రమలో నటులుగా అడుగు పెట్టారు. ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కుటుంబ సభ్యులు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు. త్రివిక్రమరావు చిన్న కుమారుడు హరీన్ చక్రవర్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కళ్యాణ్ చక్రవర్తి ఇండస్ట్రీలో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అన్న బాటలో తాను కూడా సినీ పరిశ్రమలో నటుడుగా అడుగు పెట్టాడు హరీన్ చక్రవర్తి.  ‘మ‌నుషుల్లో దేవుడు’ సినిమాలో బాలనటుడిగా నటించిన హరీన్ 1986లో ‘మామాకోడ‌ళ్ల స‌వాల్’ సినిమాతో నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ‘పెళ్లికొడుకులొస్తున్నా’ సినిమాలో యమధర్మరాజుగా నటించి మెప్పించాడు. నటుడుగా పలు సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న సమయంలో హరీన్ ఓ రోడ్డు ప్రమాదంలో మరించాడు. అంతేకాదు కళ్యాణ్ చక్రవర్తి కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కొడుకు మరణంతో కృంగిపోయిన కళ్యాణ్ చక్రవర్తి సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. చెన్నైలో స్థిరపడ్డాడు అని టాక్..

అయితే నందమూరి వశంలో ఎక్కువమంది రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య చౌదరి , ఎన్టీఆర్ పెద్ద కొడుకు హరి కృష్ణ.. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ లు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.. ఇక బాలకృష్ణ, ఎన్టీఆర్ లు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలై..  మరణం అంచుల వరకూ వెళ్లి తిరిగి బతికి బట్ట కట్టారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల     కోసం ఇక్కడ క్లిక్ చేయండ..

ఇవి కూడా చదవండి