Adivi Sesh: మేజర్ సినిమాకు మహేష్ బ్యాక్ బోన్.. హీరో అడివి శేష్ భావోద్వేగ కామెంట్స్..

మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, లవ్ లైఫ్, వార్ .. ఇలా ప్రతీదీ ట్రైలర్ లో గూస్ బంప్స్ మూమెంట్ గా ఉన్నాయి.

Adivi Sesh: మేజర్ సినిమాకు మహేష్ బ్యాక్ బోన్.. హీరో అడివి శేష్ భావోద్వేగ కామెంట్స్..
Adivi Sesh
Follow us
Rajitha Chanti

|

Updated on: May 10, 2022 | 10:51 AM

డైరెక్టర్ శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో టాలెంటెడ్ యంగ్ హీరో తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం మేజర్ (Major). 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమా జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు. మే 9న విడుదలైన మేజర్ ట్రైలర్ అద్భుతంగా ఉంది.. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, లవ్ లైఫ్, వార్ .. ఇలా ప్రతీదీ ట్రైలర్ లో గూస్ బంప్స్ మూమెంట్ గా ఉన్నాయి. ట్రైలర్ లో 26/11 ఎటాక్ విజువల్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో అడివి శేష్ భావోద్వేగ కామెంట్స్ చేశారు.

హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సింపుల్ మ్యాన్. అమ్మనాన్న, స్నేహితులు, చైల్డ్ హుడ్ క్రష్, గర్ల్ ఫ్రండ్ ఇలా మనందరిలానే అతని జీవితం కూడా సాధారణం. ఐతే అంత సాధారణమైన మేజర్ సందీప్ ఒక అసాధారణ వ్యక్తిగా ఎలా అయ్యారనేది మేజర్ లో చూస్తారు. మహేష్ గారు మేజర్ సినిమాకి బ్యాక్ బోన్. ఏం జరిగినా మహేష్ గారు వున్నారనే ఒక నమ్మకం. కోవిడ్ లాంటి కష్టకాలంలో మహేష్, నమ్రతగారే మమ్మల్ని నిలబెట్టారు. అబ్బూరి రవి గారి కి కూడా స్పెషల్ థ్యాంక్స్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరెంట్స్ కోరిక ఒక్కటే. మేజర్ సందీప్ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోవాలని కోరుకున్నారు. మేజర్ చిత్రం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఈ సినిమా మొదలుపెట్టినపుడు పాన్ ఇండియా సినిమా, మార్కెట్ పెంచుకోవడానికి చేస్తున్నారని కొందరు అన్నారు. కానీ అది అసలు విషయం కాదు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఈ దేశం ముద్దు బిడ్డ. ఆయన మాతృ భాష మలయాళం కాబట్టి మలయాళంలో డబ్ చేశాం, మన తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో చేశాం, దేశం మొత్తం చూడాలి కాబట్టి హిందీ చేశాం. ప్రతి సీన్, షాట్ ని తెలుగు, హిందీ లో షూట్ చేశాం. మన ఉద్దేశం సరైనప్పుడు విశ్వమే మనకు సహకరిస్తుంది. సోనీ పిక్చర్స్ ఈ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. అనురాగ్, శరత్ అన్నదమ్ముల్లా తోడున్నారు. ఈ సినిమాని చాలా మందికి చూపించాం. మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం కూడా ఒక స్పెషల్ షోని ప్లాన్ చేస్తాం. ట్రైలర్ తో దిమ్మతిరిగింది. సినిమా హృదయాన్ని తాకేలా వుంటుంది” అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

Also Read: Keerthy Suresh: షూటింగ్ టైంలో ఎప్పుడూ చూసిన రష్మిక పేరుతో పిలిచేవారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..

Mahesh Babu: ఆ సమయంలో నా గొంతు తడారిపోయింది.. ఆ తర్వాత మౌనంగా ఉండిపోయాను.. మహేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్..

Sarkaru Vaari Paata: బయటికి కనిపించని పోలీస్ కథ.. సర్కారు వారి పాట కథపై డైరెక్టర్ క్లారిటీ..

Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న ‘ఎంత చిత్రం’ పాట