AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agent Movie: అఖిల్‌ సినిమా మరోసారి వాయిదా పడనుందా.. గాడ్‌ ఫాదర్‌ కోసం వెనక్కి తగ్గనున్నాడా.?

Agent Movie: 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌' సినిమాతో డీసెంట్ హిట్‌ను అందుకున్నాడు అక్కినేని యంగ్ హీరో అఖిల్‌. ఈ సినిమాలో లవర్‌ బాయ్‌ లుక్‌లో అఖిల్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే కమర్షియల్‌గా మాత్రం భారీ విజయాన్ని అందుకోలేకపోయిందీ సినిమా. ఈ నేపథ్యంలోనే..

Agent Movie: అఖిల్‌ సినిమా మరోసారి వాయిదా పడనుందా.. గాడ్‌ ఫాదర్‌ కోసం వెనక్కి తగ్గనున్నాడా.?
Narender Vaitla
|

Updated on: May 10, 2022 | 2:53 PM

Share

Agent Movie: ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ సినిమాతో డీసెంట్ హిట్‌ను అందుకున్నాడు అక్కినేని యంగ్ హీరో అఖిల్‌. ఈ సినిమాలో లవర్‌ బాయ్‌ లుక్‌లో అఖిల్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే కమర్షియల్‌గా మాత్రం భారీ విజయాన్ని అందుకోలేకపోయిందీ సినిమా. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా భారీ హిట్‌ కొట్టాలనే ఉద్దేశంతో స్టైలిష్‌ డైరకెక్టర్‌ సురేందర్‌ రెడ్డితో ‘ఏజెంట్‌’ సినిమాను మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌లు చిత్రంపై అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా ఇందులో అఖిల్‌ మేకోవర్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. అయితే సినిమా విడుదల తేదీ విషయంలో మాత్రం పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది.

ఇప్పటికే కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని ఆగస్టు 12న ప్రేక్షకులకు ముందుకు తీసుకువస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 12న చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘గాడ్‌ ఫాదర్‌’ విడుదలవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏజెంట్‌ చిత్రాన్ని వాయిదా వేయనున్నారని చర్చ జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో అఖిల్‌ రా ఏజెంట్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటి వరకు కూల్, లవర్‌ బాయ్‌ రోల్‌లో కనిపించిన అఖిల్‌ తొలిసారి ఇంటెన్సివ్‌ పాత్రలో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇక ఏజెంట్ సినిమా గతంలో పలుసార్లు వాయిదా పడడానికి అఖిల్‌కు గాయం కావడం కూడా ఓ కారణమనే విషయం తెలిసిందే. గాయంతో షూటింగ్‌కు కొన్ని రోజుల బ్రేక్‌ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..