AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుకుమార్ చిత్రంలో సరికొత్త పాత్ర పోషించనున్న విజయ్ దేవరకొండ.. ‘రౌడీ’ బాయ్ ఈసారి ఎలా కనిపించనున్నాడంటే!

‘పెళ్లి చూపులు’ చిత్రంతో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న విజయ్ దేవరకొండ.. ‘అర్జున్ రెడ్డి’తో ఒక్కసారిగా సెన్సేషన్ హీరోగా మారాడు. ఈ సినిమాలో విజయ్ తన అద్భుత నటనతో కుర్రకారును ఫిదా చేశాడు. అర్జున్ రెడ్డి ఇచ్చిన విజయంతో విజయ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

సుకుమార్ చిత్రంలో సరికొత్త పాత్ర పోషించనున్న విజయ్ దేవరకొండ.. ‘రౌడీ’ బాయ్ ఈసారి ఎలా కనిపించనున్నాడంటే!
Narender Vaitla
|

Updated on: Dec 17, 2020 | 6:10 PM

Share

‘పెళ్లి చూపులు’ చిత్రంతో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న విజయ్ దేవరకొండ.. ‘అర్జున్ రెడ్డి’తో ఒక్కసారిగా సెన్సేషన్ హీరోగా మారాడు. ఈ సినిమాలో విజయ్ తన అద్భుత నటనతో కుర్రకారును ఫిదా చేశాడు. అర్జున్ రెడ్డి ఇచ్చిన విజయంతో విజయ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. విజయ్ సినిమా వస్తుందంటే ఇండస్ట్రీ మొత్తం అటువైపు చూసే పరిస్థితులు వచ్చాయి. దానికి తగ్గుట్లుగానే సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ దూసుకెళుతున్నాడీ ‘రౌడీ’ హీరో. ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ చిత్రంలో నటిస్తోన్న విజయ్.. ఈ సినిమా పూర్తికాగానే సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. ఇదిలా ఉంటే ఈ కొత్త చిత్రంలో విజయ్ మునుపెన్నడూ నటించని సరికొత్త పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ సిపాయి పాత్రలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రం ఇండియా, పాకిస్థాన్ నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాలి. విజయ్ ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు, ఇక సుకుమార్ ప్రస్తుతం బన్నీ హీరోగా నటిస్తున్న ‘పుష్ప’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తికాగానే వీరి కాంబినేషన్‌లో కొత్త సినిమా ప్రారంభంకానుంది. ఈ లెక్కన సుకుమార్, విజయ్‌ల సినిమా షూటింగ్ ప్రారంభమయ్యేది 2022లోనే అన్నమాట. హీరోలను విభిన్నంగా చూపించే సుకుమార్ విజయ్ దేవరకొండతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..