కేజీఎఫ్ నిర్మాతల కొత్త సినిమా టైటిల్ ఫిక్స్.. మూవీ పోస్టర్ లుక్ అదుర్స్.. హీరో ఎవరంటే ?..
సూపర్ హిట్ సాధించిన కేజీఎఫ్ సినిమాతో ఆ చిత్ర నిర్మాణ సంస్థ హంబలే ఫిలింస్ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ప్రస్తుతం కేజీఎఫ్ నిర్మాణ సంస్థ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో
సూపర్ హిట్ సాధించిన కేజీఎఫ్ సినిమాతో ఆ చిత్ర నిర్మాణ సంస్థ హంబలే ఫిలింస్ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ప్రస్తుతం కేజీఎఫ్ నిర్మాణ సంస్థ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ సినిమాను చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది హంబలే ఫిలింస్. ఈ సినిమాకు ‘భగీరా’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది. అయితే ఈ సినిమాలో శ్రీమురళి హీరోగా నటిస్తుండగా.. సలార్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి స్వయంగా కథ అందిస్తున్నాడట. ఈ సినిమాకు సూరి దర్శకత్వం వహించనున్నట్లుగా ఆ మూవీ నిర్మాణ సంస్థ హంబలే ఫిలింస్ సంస్థ తెలిపింది. హీరో శ్రీమురళి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ పోస్టర్‌ను విడుదల చేశామని నిర్మాణ సంస్థ తెలిపింది. గతంలో ప్రశాంత్ నీల్, శ్రీమురళి సంయుక్తంగా ‘ఉగ్రం’ అనే సినిమా చేశారు. మళ్ళీ ఆరు సంవత్సరాల తర్వాత వీరిద్దరి సమక్షంలో ఈ చిత్రం రాబోతుండడంతో భగీరాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
హంబలే ఫిలింస్ విడుదల చేసిన భగీరా పోస్టర్ అచ్చం హాలీవుడ్ సినిమా పోస్టర్లా ఉంది. మొత్తం బ్లాక్ కలర్‌తో ఈ పోస్టర్ ఉండగా.. పులి పంజా, ఆ పంజాతో చీల్చుతున్నట్లుగా ఉండగా.. శ్రీమురళి లుక్స్ అదిరిపోతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో శ్రీమురళి పోలీస్‌గా నటిస్తున్నాడనే విషయం కూడా పోస్టర్‍లో కనిపిస్తుంది. శ్రీమురళి ఖాకీ చొక్కా ధరించినట్టుగా అతని భుజం పై మూడు నక్షత్రాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.