AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘F3’ మూవీ షూటింగ్ ప్రారంభం.. క్లాప్ ఇచ్చిన అల్లు అరవింద్.. వరుణ్ ఉన్నాడు.. మరీ వెంకీ ఎక్కడ?

విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్‏లు నటించిన f2 మూవీ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రముఖ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించగా..

'F3' మూవీ షూటింగ్ ప్రారంభం.. క్లాప్ ఇచ్చిన అల్లు అరవింద్.. వరుణ్ ఉన్నాడు.. మరీ వెంకీ ఎక్కడ?
Rajitha Chanti
|

Updated on: Dec 17, 2020 | 4:43 PM

Share

విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్‏లు నటించిన f2 మూవీ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రముఖ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించగా.. ఈ చిత్రం గతేడాది బాక్సాఫీసు ముందు సూపర్ హిట్‏గా నిలించింది. తాజాగా ఎఫ్2 సీక్వెల్‏గా ఎఫ్3 సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి కూడా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభ పూజ కార్యక్రమం హైదరాబాద్‏లో గురువారం జరిగింది. హీరోయిన్ తమన్నా, హీరో వరుణ్ తేజ్‏ల ఒక సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. కాగా ఈ షూటింగ్ ప్రారంభ కార్యాక్రమంలో విక్టరీ వెంకటేశ్ కనిపించలేదు.

ప్రస్తుతం వెంకటేశ్ నారప్ప మూవీ షూటింగ్‏లో బిజీగా ఉండటమే దీనికి కారణం. వెంకీతో పాటు మెహరీన్ కూడా ఈ కార్యాక్రమంలో కనిపించలేదు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ మాట్లాడుతూ.. గత సంవత్సరం మా బ్యానర్‏లో విడుదలైన F2 మంచి కామెడీతో సూపర్ హిట్ సాధించిన విషయం మీకు తెలిసిందే. అన్ని కుదిరితే F2 సీక్వెల్‏గా F3 సినిమాను రూపొందిస్తామని చెప్పాం. దానికి మరింత వినోదాన్ని జతచేసి F3 కథను అనిల్ రావిపూడి సిద్ధం చేశారు. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్‏ల కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను మరింత నవ్విస్తుందని అనుకుంటున్నాం. డిసెంబర్ 23 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‏ను ప్రారంభిస్తున్నాం అని చెప్పారు. అయితే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి