AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upasana: ‘పిల్లల్ని కనే సామర్థ్యం గురించి అడుగుతున్నారు’.. సద్గురుతో ఉపాసన ప్రశ్న.. ఆయనిచ్చిన సమాధానమేంటంటే..

Upasana: మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రామ్‌ చరణ్‌ భార్యగానే కాకుండా వ్యాపార వేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును...

Upasana: 'పిల్లల్ని కనే సామర్థ్యం గురించి అడుగుతున్నారు'.. సద్గురుతో ఉపాసన ప్రశ్న.. ఆయనిచ్చిన సమాధానమేంటంటే..
Narender Vaitla
|

Updated on: Jul 05, 2022 | 5:29 PM

Share

Upasana: మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రామ్‌ చరణ్‌ భార్యగానే కాకుండా వ్యాపార వేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అపోలో లైఫ్‌కు వైస్‌ ఛైర్‌ పర్సన్‌గా సేవలదించిస్తోన్న ఉపాసన తన ఆలోచనలతో సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇక సోషల్‌ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉండే ఉపాసనకు ఇటీవలి కాలంలో తన సంతానం గురించి నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా ఇవే విషయాన్ని ఆధ్యాత్మిక గురువు సద్గురుతో ప్రస్తావించారు ఉపాసన. ఈ ప్రశ్నతో పాటు మరో మూడు ప్రశ్నలను సంధించారు. ఇంతకీ ఆ ప్రశ్నలు ఏంటి.? దానికి సద్గురు ఇచ్చిన సమాధానం ఏంటంటే..

ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. ‘నా వివాహం జరిగి పదేళ్లు గడుస్తోంది. వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నాను. నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. కానీ కొందరు నా జీవితంలో ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి అడుగుతున్నారు. ఇందులో మొదటిది నా రిలేషన్‌ గురించి, రెండోది రీ ప్రొడ్యూస్‌ (పిల్లలను కనే సామర్థ్యం), మూడో ఆర్‌.. జీవితంలో నా రోల్‌.. వీటి గురించే జనాలు ప్రశ్నిస్తున్నారు’ అని చెప్పుకొచ్చింది. అయితే ఈ ప్రశ్నలకు సద్గురు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

ఉపాసన ప్రశ్నలకు బదులిస్తూ.. ‘బంధం మీ వ్యక్తిగత విషయం. అందులో ఎవరూ తలదూర్చకూడదు. రెండోది రీప్రొడ్యూస్‌.. పిల్లలను కనకుండా ఉండే వారికి నేను అవార్డులిస్తాను. ఈ తరం వాళ్లు కచ్చితంగా పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రపంచ జనాభా మరీ పెరిగిపోయింది. ఒకవేళ నువ్వు ఆడ పులివి అయ్యుంటే మాత్రం కచ్చితంగా పిల్లల్ని కనమని సలహా ఇచ్చేవాడిని. ఎందుకంటే అవి అంతరించిపోతున్నాయి. కానీ మనం అంతరించడం లేదు. ఇప్పటికే మనం ఈ భూమి మీద ఎక్కువ సంఖ్యలో ఉన్నాం’ అని చెప్పుకొచ్చారు. దీంతో సద్గురు చెప్పిన ఈ సమాధానం విన్న ఉపాసాన.. మీరు చెప్పిన ఈ సలహా వింటే.. మీకు మా అమ్మ అత్తయ గార్ల నుంచి ఫోన్లు వస్తాయి అని నవ్వుతూ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..