Krithi Shetty : ఆ సినిమా నాకొక జ్ఞాపకం.. ఆసక్తికర విషయం తెలిపిన లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ది వారియర్. తమిళ్ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Krithi Shetty : ఆ సినిమా నాకొక జ్ఞాపకం.. ఆసక్తికర విషయం తెలిపిన లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి
Krithi Shetty
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 05, 2022 | 5:20 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ది వారియర్. తమిళ్ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి(Krithi Shetty)హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయినా ట్రైలర్ సినిమా పై అంచనాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. ఈ సినిమాలో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు హీరోయిన్ కృతి శెట్టి.

కృతి శెట్టి మాట్లాడుతూ.. లింగుస్వామి గారు తీసిన ‘ఆవారా’ను చాలా ఏళ్ళ క్రితం తమిళంలో చూశా. ఆ సినిమా నాకొక జ్ఞాపకం. అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సినిమా సీడీ తీసుకువెళ్లే దాన్ని. ఒక్కో రోజు రెండు మూడు సార్లు చూసిన సందర్భాలు ఉన్నాయి. లింగుస్వామి ఫోన్ చేశారని అమ్మ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే.. ఆయన సినిమాలు ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటాయి. కథలు కొత్తగా ఉంటాయి. హీరోయిన్లకు పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న రోల్స్ ఉంటాయి. కథ విన్న తర్వాత ఇంకా ఎగ్జైట్ అయ్యాను. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు కొంచెం నెర్వస్ ఫీలయ్యాను. రామ్ గారి ఎనర్జీ మ్యాచ్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి. కానీ, ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. నేను కూడా ఎంజాయ్ చేస్తూ చేశా. ‘బుల్లెట్…’ సాంగ్ క్లాస్ అయితే ‘విజిల్…’ సాంగ్ మాస్. నాకు ఎక్స్ట్రా ఎనర్జీ కావాలని అనుకున్నప్పుడు విజిల్ సాంగ్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తాను. కొంచెం స్టయిలిష్ అంటే ‘బుల్లెట్…’ సాంగ్. పాటలకు ముందు వచ్చే సీన్స్ చాలా బావుంటాయి. ‘ది వారియర్’లో నా పాత్ర అందరూ ప్రేమించేలా ఉంటుంది. గాళ్ నెక్స్ట్ డోర్, క్యూట్ రోల్. కథ విన్న వెంటనే నేను కనెక్ట్ అయ్యాను. ప్రేక్షకులు కూడా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నా. సినిమా చూసినప్పుడు మన ఇంట్లో అమ్మాయి లేదా పక్కింటి అమ్మాయి అనుకుంటారు. నా క్యారెక్టర్ పేరు విజిల్ మహాలక్ష్మి. ఆ అమ్మాయి ఆర్జే. బుల్లెట్, విజిల్స్ సాంగ్స్ చూశారు కదా! అందరూ మా పెయిర్ బావుందని అంటున్నారు. సీన్స్ కూడా బావుంటాయి. థియేటర్లలో సినిమా వచ్చే వరకు వెయిట్ చేయండి. సీన్స్ గురించి ఇప్పుడే చెప్పలేను అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే