Balakrishna Vs Chiranjeevi: దసరా వార్.. బరిలో బాలయ్యతో పోటీకి మెగాస్టార్ కూడా..
తెలుగు రాష్ట్రాల్లో పండగలు వచ్చాయంటే చాలు పల్లెలపాతో పాటు , థియేటర్స్ కూడా సిద్ధం అవుతాయి. ఫెస్టివల్ సీజన్ ను టార్గెట్ చేసి బడా సినిమాలన్నీ క్యూ కడుతాయి. భారీ రిలీజ్ లతో హంగామా జరుగుతుంది ఏదైనా పండగొస్తే. ఇప్పుడు ఇదే పోటీ దసరాకు కనిపించనుంది.
తెలుగు రాష్ట్రాల్లో పండగలు వచ్చాయంటే చాలు పల్లెలపాతో పాటు, థియేటర్స్ కూడా సిద్ధం అవుతాయి. ఫెస్టివల్ సీజన్ ను టార్గెట్ చేసి బడా సినిమాలన్నీ క్యూ కడుతాయి. భారీ రిలీజ్ లతో హంగామా జరుగుతుంది ఏదైనా పండగొస్తే. ఇప్పుడు ఇదే పోటీ దసరాకు కనిపించనుంది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు దసరా ను టార్గెట్ చేసి రిలీజ్ అవ్వనున్నాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న గోపిచంద్ మలినేని ఇప్పుడు బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేసి .. అంతకు మించి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తోన్నడు. ఈ సినిమానుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, వీడియో గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే మరో వైపు మెగాస్టార్ చిరంజీవి కూడా దసరా బరిలోకి దూకానున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న గాడ్ ఫాదర్ సినిమా కూడా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమానుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ లో మెగాస్టార్ చాలా పవర్ ఫుల్ గా హుందాగా కనిపించారు. ఈ సినిమాలో చిరు సిస్టర్ గా నయనతార నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట మేకర్స్. దాంతో ఈ దసరాకు మెగా, నందమూరి అభిమానుల హంగామా కనిపించం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.