AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable with NBK: ముగ్గురు మిత్రుల అపురూప సమ్మేళనం.. ఆహా అన్‌స్టాపబుల్‌లో సందడే సందడి..

నట సింహం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా మారి నిర్వహిస్తోన్న టాక్‌ షో అన్‌స్టాపబుల్‌. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతోన్న ఈ టాక్‌షోను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. ఇప్పటికే విజయవంతంగా తొలి సీజన్‌ను పూర్తి చేసుకున్న ఈ టాక్‌ షో రెండో సీజన్‌ ప్రారంభమై దూసుకుపోతోంది. రెండో సీజన్‌లో తొలి..

Unstoppable with NBK: ముగ్గురు మిత్రుల అపురూప సమ్మేళనం.. ఆహా అన్‌స్టాపబుల్‌లో సందడే సందడి..
Aha Unstoppable
Narender Vaitla
|

Updated on: Nov 17, 2022 | 8:39 PM

Share

నట సింహం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా మారి నిర్వహిస్తోన్న టాక్‌ షో అన్‌స్టాపబుల్‌. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతోన్న ఈ టాక్‌షోను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. ఇప్పటికే విజయవంతంగా తొలి సీజన్‌ను పూర్తి చేసుకున్న ఈ టాక్‌ షో రెండో సీజన్‌ ప్రారంభమై దూసుకుపోతోంది. రెండో సీజన్‌లో తొలి ఎపిసోడ్‌కు నారా చంద్రబాబు నాయుడుని గెస్ట్‌గా ఆహ్వానించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన నిర్వాహకులు.. ఇప్పుడు 4వ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌కు చేయనున్నారు. ఈ ఎపిసోడ్‌లో ఉమ్మడి ఏపీలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, మాజీ స్పీకర్‌ సురేశ్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.

బాలకృష్ణ, సురేశ్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురు నిజాం కాలేజీలో కలిసి చదువుకున్న విషయం తెలిసిందే. దీంతో ముగ్గురు మిత్రులు కలిసి ఒకేషోలో పాల్గొనడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఆహా.. తాజాగా 4వ ఎపిసోడ్‌ ప్రోమోను విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి ఈ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ కానుంది. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమో ఒక్కసారిగా ఎపిసోడ్‌పై అంచనాలు పెంచేసింది. బాలయ్య కుటుంబానికి చూసిన మీకు ఈవాళ బాలయ్య స్నేహాన్ని పరిచయం చేయాలనుకుంటున్నా అంటూ షోను మొదలుపెట్టారు బాలకృష్ణ.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా అటు రాజకీయాల అంశాలతో పాటు కాలేజీలో సరదాగా గడిపిన విషయాలను పంచుకున్నారు. దివంగత నేత రాజశేఖర్‌ రెడ్డి గురించి కిరణ్‌ కుమార్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. నేను బతికి ఉన్న కాబట్టి సీఎంను అయ్యానని కిరణ్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని పెంచేశాయి. ఇక ఈ షోలో వీరిద్దరితో పాటు నటి రాధిక కూడా పాల్గొంది. మొత్తానికి ప్రోమో చూస్తుంటే సరదగా సాగడంతో పాటు, రాజకీయ అంశాలను కూడా టచ్‌ చేసినట్లు కనిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇండస్ట్రీలో తోపు కమెడియన్.. చనిపోయినా ఇండస్ట్రీని నుంచి ఎవరు వెళ్
ఇండస్ట్రీలో తోపు కమెడియన్.. చనిపోయినా ఇండస్ట్రీని నుంచి ఎవరు వెళ్
వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గిందో తెలుసా..?
వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గిందో తెలుసా..?
ఇలా చేస్తే.. జస్ట్10 నిమిషాల్లోనే దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలు
ఇలా చేస్తే.. జస్ట్10 నిమిషాల్లోనే దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలు
సినిమా స్టైల్‌లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా..
సినిమా స్టైల్‌లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా..
వికెట్లకు కాకుండా బ్యాటర్ తలకు బంతి గురి పెట్టిన బౌలర్
వికెట్లకు కాకుండా బ్యాటర్ తలకు బంతి గురి పెట్టిన బౌలర్
కేంద్రం పంపిన అలర్ట్ మెస్సేజ్ రాలేదా..? ఈ సెట్టింగ్ ఆన్ చేస్కోండి
కేంద్రం పంపిన అలర్ట్ మెస్సేజ్ రాలేదా..? ఈ సెట్టింగ్ ఆన్ చేస్కోండి
అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?
అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?
8 సిక్సర్లు, 5 ఫోర్లు.. ఒకే ఓవర్‌లో 70 పరుగులు..
8 సిక్సర్లు, 5 ఫోర్లు.. ఒకే ఓవర్‌లో 70 పరుగులు..
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.