AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhakar : కొడుకు బూతు పాటపై వివాదం.. క్షమాపణలు చెప్పిన నటుడు ప్రభాకర్..

సోషల్ మీడియాలో గత రెండుమూడు రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు చంద్రహాస్. సినిమా విడుదలకు ముందే ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ఇటీవల తన సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చంద్రహాస్ పాడిన బూతు పాటపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అతడి తీరుపై నెటిజన్స్ మండిపడ్డారు. అయినా తాను సారీ చెప్పనంటూ మరో వీడియో రిలీజ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది.

Prabhakar : కొడుకు బూతు పాటపై వివాదం.. క్షమాపణలు చెప్పిన నటుడు ప్రభాకర్..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Feb 07, 2026 | 7:57 PM

Share

బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా సక్సెస్ అయ్యేందుకు వెయిట్ చేస్తున్నారు. కానీ తన సినిమాల విడుదలకు ముందే తన బిహేవియర్ కారణంగా వివాదంలో చిక్కుకుంటున్నారు. చంద్రహాస్ హీరోగా నటించిన రెండో చిత్రం బరాబర్ ప్రేమిస్తా. డైరెక్టర్ సంపత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మేఘనా కథానాయికగా నటించింది. అయితే ఇటీవల జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చంద్రహాస్ గుంజి గుంజి అనే పాట పాడాడు. కానీ అందులో బూతులు రావడంతో వివాదం మొదలైంది. వేదికపై అందరూ అడియన్స్, అతిథలు ఉండగా అలాంటి అనుచిత పదాలు వాడుతూ పాట పాడడంపై నెటిజన్స్ మండిపడ్డారు. దీంతో చంద్రహాస్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే తన సాంగ్ వివాదంపై స్పందిస్తూ సారీ చెప్పను అంటూ చంద్రహాస్ చేసిన కామెంట్స్ పై వివాదం మరింత ముదిరింది. దీంతో ఇప్పుడు ఈ కాంట్రవర్సీపై చంద్రహాస్ తండ్రి నటుడు ప్రభాకర్ క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు.

ప్రభాకర్ మాట్లాడుతూ.. “నా కుటుంబ సభ్యులను ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా తప్పు. ఒక చిన్న పొరపాటుతో నా పెంపకాన్ని తక్కువ చేసి మాట్లాడవద్దు. నా కుమారుడి ప్రవర్తన వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే వాళ్లను క్షమించమని అడుగుతున్నాను. ఆరోజు సినిమా వేడుకకు వచ్చిన పెద్దలకు నేను క్షమాపణలు చెబుతున్నాను” అని అన్నారు. ప్రస్తుతం నటుడు ప్రభాకర్ షేర్ చేసిన వీడియోపై భిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్స్.

ఇప్పటికే ఈ వివాదంపై జేడీ చక్రవర్తి స్పందిస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. అయితే తాను తన సినిమా వేడుకకు జేడీ చక్రవర్తిని పిలిచి తప్పు చేశానని అన్నాడు చంద్రహాస్. ఫిబ్రవరి 6న విడుదలైన తన సినిమాను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు చంద్రహాస్. సాంగ్ వివాదం ఎఫెక్ట్ తన మూవీపై పడుతుందేమోనని భయపడ్డానని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..

Follow Us