పక్షవాతానికి గురైన ప్రముఖ నటి.. ఆర్థిక సాయం కావాలంటూ భర్త అభ్యర్థన

ప్రముఖ టీవీ నటి నిషి సింగ్‌ బద్లీ పక్షవాతానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తుండగా.. తన భార్య కోలుకునేందుకు

  • Tv9 Telugu
  • Publish Date - 6:20 pm, Fri, 25 September 20
పక్షవాతానికి గురైన ప్రముఖ నటి.. ఆర్థిక సాయం కావాలంటూ భర్త అభ్యర్థన

Nishi Singh Bhadli: ప్రముఖ టీవీ నటి నిషి సింగ్‌ బద్లీ పక్షవాతానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తుండగా.. తన భార్య కోలుకునేందుకు ఆర్థిక సాయం కావాలంటూ ఆమె భర్త, రచయిత సంజయ్ సింగ్ బద్లీ అభ్యర్థిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గత రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. గతేడాది ఫిబ్రవరిలో పక్షవాతానికి గురయ్యారు. ఆ తరువాత నిదానంగా కోలుకుంటుండగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి ఆమె పక్షవాతం బారిన పడ్డారు.

ఆమెకు చికిత్స చేయించేందుకు తాము దాచుకున్న డబ్బులు మొత్తం అయిపోయాయని, ఈ క్రమంలో తమ ఫ్లాట్‌ను సైతం తనఖా పెట్టినట్లు ఆయన వెల్లడించారు. సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి తన కుటుంబంతో సంబంధాలు లేవని, అందుకే వారిని ఎలాంటి సహాయం కోరలేదని సంజయ్ వెల్లడించారు.

ఇక ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉండగా.. కుమారుడు(19) ఢిల్లీలో ఉండగా, కుమార్తె(16) వారితో పాటు ముంబయిలో నివసిస్తోంది. నిషిని చూసుకుంటూ ఉండటంతో సంజయ్ కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ప్రస్తుతం తమ వద్ద డబ్బులు లేవని, సాయం చేయాలని ఆయన కోరుతున్నారు. కాగా హిట్లర్ దీదీ, ఖుబూల్ హై, ఇష్క్ బాజ్‌, తెనాలి రామ వంటి షోలలో నిషి నటించారు.

Read more:

రాజ్‌తరుణ్ కోసం లేడీ విలన్‌.. ఎవరంటే..!

గ్రామ/వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌