ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్ కంప్లీట్

ప్రస్తుత కరోనా సమయంలో ఓటీటీల ట్రెండ్ పెరగింది. పలు బడా సినిమాలు కూడా ఓటీటీ ద్వారానే రిలీజవుతున్నాయి. పలు వెబ్ సిరీస్ లు ఈ లాక్ డౌన్ సీజన్ లో ప్రేక్షకులను అలరించాయి.

  • Ram Naramaneni
  • Publish Date - 6:55 pm, Fri, 25 September 20
ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్ కంప్లీట్

ప్రస్తుత కరోనా సమయంలో ఓటీటీల ట్రెండ్ పెరిగింది. పలు బడా సినిమాలు కూడా ఓటీటీ ద్వారానే రిలీజవుతున్నాయి. పలు వెబ్ సిరీస్ లు ఈ లాక్ డౌన్ సీజన్ లో ప్రేక్షకులను అలరించాయి. కరోనా సీజన్ కు ముందు చాలామందికి  వెబ్ సిరీస్ లపై పెద్దగా నాలెడ్జ్ లేదు. కానీ ఇప్పుడు సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ లు చూస్తున్నారు జనాలు. దీంతో అగ్ర నటీనటులు కూడా వెబ్ సిరీస్ లలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ క్రమంలో అగ్ర కథానాయిక సమంత ‘ఫ్యామిలీ మ్యాన్ – 2’లో న‌టించారు. ఇది మంచి ప్రేక్షకాదరణ పొందిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌కు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే.

ఈ సిరీస్ లో సమంత  ఉగ్ర‌వాదిగా క‌నిపించ‌నున్న‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో సామ్‌ త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్‌ను రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే డైరెక్ట్ చేశారు. మ‌నోజ్ భాజ్ పాయ్‌, ప్రియ‌మ‌ణి, సందీప్ కిష‌న్‌, త‌దిత‌రులు న‌టిస్తున్నారు. లాక్‌డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డ్డ మిగిలిన షూటింగ్ కూడా తాజాగా కంప్లీట్ అయినట్లు ద‌ర్శ‌కుడు రాజ్‌, డీకే  సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘ఫ్యామిలీ మ్యాన్ – 2’ త్వ‌ర‌లో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది.

 

View this post on Instagram

 

Finally every single shot of #TheFamilyManSeason2 is done! Had to somehow pull it off during these tough times! Incredible job by our crew! @primevideoin @iamsumankumar @suparnverma @rahulgandhi9 @manojkumarkalaivanan @cameronbryson @sainisjohray @aejaz_gulab @yannickben @sumeetkotian @ketan_sodha @suveera.swetesh.stylist @castingchhabra @tusharseth09 @i_dpsingh @krunaliiii @wasim_khansaab @sunil11711 @ketkisamant @vandana8810 @suhasnavarathna @manishamakwana18 @kochar.chirag @sharankothari @soumiltiwarii @nasir5488 @kohli__utkarsha @rk_pranav @zuhair30 @_shellysharma @hiren181 @chatterjeeabhinav @the_kochikaran @dev23karan @roshan_chowdhry @ramcharantej.labani @vidhidedhia2 @ashitajha @zenishamerchant @aar.u.shirious @aparajita_atre @aarti.rajput01 @itisanu

A post shared by Raj & DK (@rajanddk) on

Also Read :

Breaking : తెలంగాణలో తెరుచుకోనున్న బార్లు, పబ్బులు, క్లబ్బులు !

ప్రభుత్వం ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

బంగారం ధర : అలా తగ్గి, ఇలా పెరిగింది !