Breaking News
  • ఢిల్లీ: జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం. కోవిడ్‌ విజృంభణ తర్వాత ఏడోసారి ప్రధాని మోదీ ప్రసంగం. దేశంలో మరణాల రేటు తక్కువగా ఉంది. ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగిద్దాం-ప్రధాని మోదీ. కరోనాను ఎదుర్కోవడంతో అగ్రదేశాల కంటే భారత్‌ మెరుగ్గా ఉంది. 10 లక్షల కేసుల్లో 83 మరణాలు మాత్రమే సంభవిస్తున్నాయి. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది-మోదీ. ఏ మాత్రం ఆదమరిచినా ఇబ్బందులు తప్పవు-మోదీ. 10 లక్షల మందిలో ఐదున్నర వేల మందికే కరోనా సోకింది. కరోనాపై పూర్తి విజయం సాధించే వరకు పోరాటం ఆపొద్దు. కరోనా పరీక్షల కోసం 2 వేల ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది సేవా భావంతో పనిచేస్తున్నారు. భౌతిక దూరం పాటించండి.. మాస్కులు ధరించండి-మోదీ. మీరు.. మీ కుటుంబాలు సురక్షితంగా ఉండాలి-ప్రధాని మోదీ. త్వరలోనే కరోనా పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటిపోతుంది-మోదీ.
  • విజయవాడ: సీపీ కార్యాలయ ఉద్యోగి మహేష్‌ హత్య కేసు. మహేష్‌ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్‌. పదో తేదీ రాత్రి 10 గంటలకు మహేష్‌ను కాల్చి చంపారు. కేసులో కీలక ఆధారాలు లభించాయి. గన్‌కు సంబంధించిన వివరాలు సేకరించాం. సాకేత్‌రెడ్డి, గంగాధర్‌ కలిసి మహేష్‌ హత్య చేశారు. సాకేత్‌ లాక్‌డౌన్‌లో గయ వెళ్లి గన్‌ను కొనుగోలు చేశాడు. -విజయవాడ సీపీ శ్రీనివాసులు. బాలుడిని కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేద్దామని సందీప్‌ స్కెచ్‌. సందీప్‌ను హైదరాబాద్‌ నుంచి సాకేత్‌ పిలిపించాడు.
  • ఏపీలో కొత్తగా 3,503 కరోనా కేసులు, 28 మంది మృతి. ఏపీలో మొత్తం 7,89,553 కేసులు, 6,481 మంది మృతి. ఏపీలో 33,396 యాక్టివ్‌ కేసులు, 7,49,676 మంది డిశ్చార్జ్‌.
  • విజయవాడ: ఈ రోజు 11,981 మంది దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ రోజు సా.6 గంటల వరకు రూ.14,54,345 ఆదాయం వచ్చింది. రేపు 13 వేల మందికి అమ్మవారి దర్శనం కల్పిస్తాం. రేపు తె.3 గంటల నుంచి రా.9 గంటల వరకు దర్శనాలు. రేపు మ.3 గంటలకు అమ్మవారికి సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. -దుర్గగుడి ఈవో సురేష్‌బాబు.
  • హైదరాబాద్‌ ముంపు సమస్యమీద విస్తృతమైన చర్చ జరగాలి. టీవీ9 ఓ వెబినార్‌ పెడితే అందరి అభిప్రాయాలు తెలుస్తాయి. హైదరాబాద్‌లో ఎన్డీఎంఏ రిపోర్ట్‌ ఎందుకు అమలు కావడం లేదు. ఫిరంగినాలా ఆక్రమణే పాతబస్తీ మునిగేందుకు కారణం. -బిగ్‌ డిబేట్‌లో పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ పురుషోత్తంరెడ్డి.
  • తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించాలని సీఎం జగన్‌కు ఆహ్వానం. సీఎంను ఆహ్వానించిన మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ప్రతినిధులు.
  • శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, 10 గేట్లు ఎత్తివేత. ఇన్‌ఫ్లో 3,26,466 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 4,03,188 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు. ప్రస్తుత నీటినిల్వ 211 టీఎంసీలు.

Breaking : తెలంగాణలో తెరుచుకోనున్న బార్లు, పబ్బులు, క్లబ్బులు !

కరోనా కారణంగా తెలంగాణలో మూతపడ్డ బార్లు, పబ్బులు, క్లబ్బులు త్వరలో తెరుచుకోనున్నాయి. ఇందుకు సంబంధించిన అనుమతులను తెలంగాణ సర్కార్ జారీ చేసింది.

Telangana State to reopen pubs bars, Breaking : తెలంగాణలో తెరుచుకోనున్న బార్లు, పబ్బులు, క్లబ్బులు !

కరోనా కారణంగా తెలంగాణలో మూతపడ్డ బార్లు, పబ్బులు, క్లబ్బులు త్వరలో తెరుచుకోనున్నాయి. ఇందుకు సంబంధించిన అనుమతులను తెలంగాణ సర్కార్ జారీ చేసింది. డ్యాన్సులు, మ్యూజికల్ ఈవెంట్స్ పై నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయా ప్రదేశాల్లో పనిచేసే సిబ్బంది మాస్కులు, గ్లౌజుల ధరించాలని సూచించింది. రోజుకు రెండుసార్లు ఆ ప్రాంతాలను శానిటైజ్ చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయి. ఈ క్షణమే తెలంగాణలో బార్లు, క్లబ్బులు, టూరిజం బార్లు తెరుచుకోవచ్చు.

బార్లు , పబ్బుల్లో నిబంధనలు

-థర్మామీటర్లు వాడాలి
-క్యూ పద్దతి పాటించేలా, శుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలి
-సిబ్బంది మొత్తం మాస్కులు , హ్యాండ్ గ్లౌసెస్ ధరించాలి.
– మ్యూజికల్ ఈవెంట్స్ ,డాన్స్ ఫ్లోర్స్ , గుమిగూడడం నిషేధం
-రోజు ఉదయం సాయంత్రం బార్లు క్లీన్ చేయాలి…
-కస్టమర్ కూర్చునే ముందు కుర్చీలు , టేబుల్ శుభ్రపరచాలి.
-వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్తలు పాటించాలి..
-వైన్ షాపుల వద్ద పర్మిట్ రూమ్ లపై కొనసాగనున్న నిషేధం

Also Read :

‘పబ్​జీ’ ప్రేమాయణం, చివరకు !

హేమంత్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ !

బాలూ, నువ్వు లేకుండా ఎలా ..?

Related Tags