రాజ్‌తరుణ్ కోసం లేడీ విలన్‌.. ఎవరంటే..!

కెరీర్ ప్రారంభంలోనే హ్యాట్రిక్‌ విజయాలతో టాలీవుడ్‌లో మంచి పేరును సాధించిన రాజ్ తరుణ్‌.. గత రెండు, మూడేళ్లుగా మంచి వరుస పరాజయాలతో డీలా పడ్డారు

రాజ్‌తరుణ్ కోసం లేడీ విలన్‌.. ఎవరంటే..!
Hero Raj Tharun Accident Case
Follow us

| Edited By:

Updated on: Sep 25, 2020 | 5:48 PM

Lady villain for Raj Tarun: కెరీర్ ప్రారంభంలోనే హ్యాట్రిక్‌ విజయాలతో టాలీవుడ్‌లో మంచి పేరును సాధించిన రాజ్ తరుణ్‌.. గత రెండు, మూడేళ్లుగా మంచి వరుస పరాజయాలతో డీలా పడ్డారు. ఇక ప్రస్తుతం ఈ నటుడు విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో ఒరేయ్ బుజ్జిగాలో నటించగా.. ఈ మూవీ అక్టోబర్ 2న ఓటీటీలో విడుదల కానుంది. అయితే అదే దర్శకుడితో రాజ్ తరుణ్ మరో సినిమాను ప్రకటించారు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

ఇక ఈ మూవీలో విలన్‌గా ఓ హీరోయిన్‌ నటించనున్నారట. టాలీవుడ్‌ వర్గాల సమాచారం ఆ పాత్ర కోసం అవును ఫేమ్ పూర్ణను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ మూవీలో చాలా సర్‌ప్రైజింగ్‌ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ ఉండనున్నాయని టాక్‌. కాగా ఈ చిత్రానికి విజయ్ ఆస్థాన సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించనున్నారు. వనమల్లె క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ కింద అనంత్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Read More:

గ్రామ/వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

‘నిశ్శబ్దం’ అనుష్క దగ్గరికి అలా వెళ్లిందట.. రివీల్ చేసిన దర్శకుడు