Exclusive: చిరంజీవి మూవీ నుంచి తప్పుకున్న త్రిష.. కారణమేంటంటే..!

మెగాభిమానులకు ఇది ఒకరకంగా షాకింగ్ న్యూస్‌నే. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం నుంచి త్రిష తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు.

Exclusive: చిరంజీవి మూవీ నుంచి తప్పుకున్న త్రిష.. కారణమేంటంటే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 13, 2020 | 7:29 PM

మెగాభిమానులకు ఇది ఒకరకంగా షాకింగ్ న్యూస్‌నే. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం నుంచి త్రిష తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు త్రిష్ సోషల్ మీడియాలో తెలిపారు. “కొన్ని సార్లు మనకు చెప్పిన విషయాలు, చర్చించిన విషయాలు మారొచ్చు. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన నేను చిరంజీవి గారి సినిమా నుంచి తప్పుకున్నా. మరో ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్‌తో తెలుగు ప్రేక్షకులను త్వరలో పలకరిస్తా” అని త్రిష కామెంట్ పెట్టారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు ఆమె విషెస్ చెప్పారు.

https://twitter.com/trishtrashers/status/1238438787488743426

కాగా చిరంజీవి నటిస్తోన్న ఆచార్యకు కొరటాల దర్శకత్వం వహిస్తున్నారు. సామాజిక కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోందని మూవీ నిర్మాతల్లో ఒకరైన రామ్ చరణ్ ఓ సందర్భంలో వెల్లడించారు. దీంతో చిరుతో త్రిష రెండో సారి రొమాన్స్ చేయనుందని అందరూ అనుకున్నారు. ఇక అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ వారంలో త్రిష ఆచార్య షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ లోపే ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఆమె తప్పుకోవడంతో అందరికీ షాక్ తగిలినట్లైంది. మరి ఏ కారణం వలన త్రిష ఈ మూవీ నుంచి తప్పుకుంది..? చిరు జోడీగా ఎవరు నటిస్తారు..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం సూపర్‌స్టార్ మహేష్‌ను అనుకుంటున్నట్లు ఫిలింనగర్‌ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే మహేష్‌తో సంప్రదింపులు కూడా జరిపినట్లు టాక్. కానీ అధికారిక ప్రకటన రాకపోవడంతో.. ఈ గాసిప్‌పై కూడా డైలమా నెలకొంది. కాగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా., రెజీనా ప్రత్యేక గీతంలో కనిపించనుంది. అక్టోబర్‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Read This Story Also: ఆర్మీకి పాకిన కరోనా.. జవాన్‌కు పాజిటివ్..!