తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లు బంద్..!
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ కానున్నాయా..! అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి దేశంలో రోజు రోజుకు విస్తరిస్తోన్న నేపథ్యంలో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతోన్న విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ కానున్నాయా..! అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి దేశంలో రోజు రోజుకు విస్తరిస్తోన్న నేపథ్యంలో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతోన్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారిని అడ్డుకునే క్రమంలో భాగంగా ప్రభుత్వాలు ముందస్తు చర్యలను తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో స్కూళ్లు, కాలేజీలు షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, పబ్‌లు ఓ నెల రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వాటన్నింటికి సెలవులను ప్రకటిస్తూ అధికారిక ప్రకటనలు ఇచ్చేశాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమవతున్నాయి. ఏపీ, తెలంగాణలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు కావడంతో.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇటు టాలీవుడ్ పెద్దలు కూడా కరోనా నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ సభ్యులు శనివారం ఉదయం 11 గంటలకు ఫిల్మ్ చాంబర్ ఆవరణలో భేటీ అవ్వబోతున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో థియేటర్ల పరిస్థితి ఏంటి..? ఇక్కడ థియేటర్లను మూసి వేస్తే పర్యవసానం ఎలా ఉంటుంది..? ఒకవేళ మూసి వేయాలని ప్రభుత్వం భావిస్తే ఎన్ని వారాలు మూసేయాలి..? వంటి అంశాలపై వారు చర్చించబోతున్నారు. దాదాపుగా థియేటర్లు బంద్ చేయాలనే ఆలోచనలోనే సినీ ఇండస్ట్రీ పెద్దలు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చాలా సినిమాల విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉంది.
Read This Story Also: చిరంజీవి మూవీ నుంచి తప్పుకున్న త్రిష.. కారణమేంటంటే..!