Pooja Hegde: సల్మాన్‌తో అవకాశం.. పూజా షాకింగ్ డెసిషన్..!
వరుస విజయాలతో మంగళూరు బ్యూటీ పూజా హెగ్డే ఫుల్ ఫాంలో ఉంది. ఇటు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్‌లోనూ పూజాకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని బుట్టబొమ్మ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
వరుస విజయాలతో మంగళూరు బ్యూటీ పూజా హెగ్డే ఫుల్ ఫాంలో ఉంది. ఇటు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్‌లోనూ పూజాకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని బుట్టబొమ్మ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫర్హాద్ సామ్జీ తెరకెక్కిస్తోన్న కబీ ఈద్ కబీ దీవాళి అనే చిత్రంలో సల్మాన్ ఖాన్‌తో కలిసి మొదటిసారిగా రొమాన్స్ చేయబోతుంది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలో పూజా ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుందట.
అదేంటంటే ఈ సినిమా కోసం తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకుందట పూజా. వరుస అవకాశాలతో ఉన్న ఏ హీరోయిన్ అయినా తన పారితోషికాన్ని తగ్గించుకునేందుకు అంత ఆసక్తిని చూపదు. అంతేకాదు ఇక స్టార్ హీరో సినిమా అంటే కచ్చితంగా మంచి రెమ్యునరేషన్‌నే డిమాండ్ చేస్తుంటారు హీరోయిన్లు. కానీ సల్లూ భాయ్ సినిమా అనే సరికి పూజా వెంటనే రెమ్యునరేషన్‌ను తగ్గించుకుందట. ఇప్పుడు ఆ ఆఫర్ పోతే.. మళ్లీ ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తుందో..? రాదో..? అనుకుందో ఏమో తెలీదు గానీ.. పూజా పారితోషికం తగ్గించుకోవడం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే పూజా ప్రస్తుతం తెలుగులో అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ప్రభాస్ 20వ చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని ఆఫర్లు ఆమె చేతిలో ఉన్నట్లు సమాచారం.
Read this Story Also: ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు టైటిల్ షాక్..!