RRR movie: ‘ఆర్ఆర్ఆర్‌’ టీమ్‌కు టైటిల్ షాక్..!

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

RRR movie: 'ఆర్ఆర్ఆర్‌' టీమ్‌కు టైటిల్ షాక్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 13, 2020 | 4:57 PM

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది జనవరి 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ప్రకటించిన రాజమౌళి.. పక్కా ప్రణాళికతో షూటింగ్‌ను కానిస్తున్నారు. అయితే ఈ మూవీకి ఆర్ఆర్ఆర్ అనే టైటిల్‌ను ఎప్పుడో ఫైనల్ చేసిన రాజమౌళి.. దానికి సబ్ టైటిల్‌‌ను ఉగాది కానుకగా రివీల్ చేయాలని భావించారట. ఈ క్రమంలో ప్రేక్షకుల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించిన ఆర్ఆర్ఆర్ టీమ్.. వాటన్నింటిలో రఘుపతి రాఘవ రాజారాం అనే టైటిల్‌ను ఫైనల్ చేసిందట. ఇక ఆ టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించడం కోసం ఫిలింనగర్‌కు వెళ్లిన రాజమౌళి టీమ్‌కు షాక్ ఎదురైందట.

అదేంటంటే.. అప్పటికే ఈ టైటిల్‌ను మరో మూవీ నిర్మాతలు రిజిస్ట్రర్ చేయించారట. ఈ నేపథ్యంలో వారిని కలిసిన ఆర్ఆర్ఆర్ టీమ్.. రఘుపతి రాఘవ రాజారాంకు తాము తీసుకుంటామని.. అందుకు డబ్బులు చెల్లిస్తామని చెప్పారట. అయితే సదరు నిర్మాతలు ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి టైటిల్ కోసం భారీ డబ్బును డిమాండ్ చేశారట. బేరాసారాలు ఆడినప్పటికీ.. వారు వెనక్కి తగ్గలేదట. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ వెనుదిరిగిందట. అంతేకాదు అంతకుముందు టాలీవుడ్‌లో హల్‌చల్ చేసిన రామ రావణ రాజ్యం అనే టైటిల్‌నే ఆర్ఆర్ఆర్‌కు పెట్టాలని దర్శకనిర్మాతలు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. మరి ఆర్ఆర్ఆర్ టైటిల్‌ ఏం పెట్టబోతున్నారు..? కొత్త సంవత్సరం కానుకగా ఆర్ఆర్ఆర్ టైటిల్‌ను రివీల్ చేస్తారా..? లాంటి ప్రశ్నలకు త్వరలోనే సమాధానం తేలనుంది.

కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా.. వారి సరసన అలియా, ఒలివియా కనిపించనున్నారు. అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణ, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాహుబలి లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read this Story Also: ‘బిగ్‌ బాస్ 4’ హోస్ట్‌గా మహేష్ బాబు..!