AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha Krishnan : తమిళపొన్ను అభిమానులకు నిరాశ.. చెన్నై చంద్రం త్రిష 60వ సినిమాకు అనుకోని షాక్..

అందం అభినయంతో ఆకట్టుకున్న తారల్లో త్రిష ఒకరు. ఈ అమ్మడు తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా తనదైన ముద్రను వేసింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన ఈ ముద్దుగుమ్మ నటించి అలరించింది.

Trisha Krishnan : తమిళపొన్ను అభిమానులకు నిరాశ.. చెన్నై చంద్రం త్రిష 60వ సినిమాకు అనుకోని షాక్..
Rajeev Rayala
|

Updated on: Mar 18, 2021 | 4:44 PM

Share

Trisha Krishnan :  అందం అభినయంతో ఆకట్టుకున్న తారల్లో త్రిష ఒకరు. ఈ అమ్మడు తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా తనదైన ముద్రను వేసింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన ఈ ముద్దుగుమ్మ నటించి అలరించింది. ఇటీవల తెలుగులో సినిమాలు తగ్గించింది త్రిష. రీసెంట్ గా తమిళ్ లో విజయ్ సేతుపతి సరసన నటించిన 96 సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి పోటాపోటీగా నటించిన త్రిష అందరిని ఆకట్టుకుంది.

అయితే ఈ అమ్మడుకొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే అనుకోని కారణాల వల్ల ఆ సినిమానుంచి తప్పుకుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, అలాగే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది ఈ చెన్నై బ్యూటీ.ఈ నేపథ్యంలో తమిళ్ లో త్రిష ఓ సినిమా చేస్తుంది. పరమపతం విలయట్టు అనే సినిమా చేస్తుంది. ఈ మూవీ త్రిష కెరియర్ లో 60వ సినిమా. 24 ఫ్రెమ్స్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తిరుగ్ననం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష డాక్టర్ గా కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. గతఏడాది విడుదలకావల్సిన ఈ సినిమా అనేక కారణాల చేత వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ సినిమా ఎంత ఆలస్యమైన థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తారని అభిమానులంతా అనుకున్నారు కానీ ఈ సినిమాను ఓటీటీ వేదికగా  రిలీజ్ చేస్తున్నారు. డిస్నీ + హాట్‌స్టార్‌లోఈ సినిమా త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా తో పాటు త్రిష  మణిరత్నం తెరకెక్కిస్తున్న  పీరియడ్ చిత్రం పొన్నియిన్ సెల్వన్ షూటింగ్లో బిజీగా ఉంది . ఈ చిత్రంలో త్రిష చోళ యువరాణి కుందవై పాత్రలో నటించనుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Saif Ali Khan in a new look : సైఫ్ అలీఖాన్ న్యూ లుక్.. ‘ఆదిపురుష్’ లో కనిపించేది ఇలానేనా..

అనుపమ గుండె ముక్కలైపోయిందా..? ఆ పోస్టులు బుమ్రాను ఉద్దేశించేనా.?Anupama post about bumrah marriage video

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు