Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saif Ali Khan in a new look : సైఫ్ అలీఖాన్ న్యూ లుక్.. ‘ఆదిపురుష్’ లో కనిపించేది ఇలానేనా..

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా చకచకా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇప్పటికే వరుసగా భారీ సినిమాలను లైన్ లో పెట్టిన డార్లింగ్ కంటిన్యూగా షూటింగ్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా

Saif Ali Khan in a new look : సైఫ్ అలీఖాన్ న్యూ లుక్.. 'ఆదిపురుష్' లో కనిపించేది ఇలానేనా..
Saif Ali Khan
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 18, 2021 | 4:10 PM

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా చకచకా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇప్పటికే వరుసగా భారీ సినిమాలను లైన్ లో పెట్టిన డార్లింగ్ కంటిన్యూగా షూటింగ్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో బొట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు టీజర్లు ఆకట్టుకుంటున్నాయి.

అలాగే ఈ సినిమాతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. రామాయణ నేపథ్యంలో తెరక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నాడు. కృతిసనన్ సీత పాత్రలో కనిపించనుంది. చెడు పై మంచి సాధించిన విజయం అనే కాప్షన్ తో రూపొందుతున్న ఈ సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉన్నాయి.  ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. అయితే సైఫ్ అలీఖాన్ సతీమణి హీరోయిన్ కరీనా కపూర్ రెండొవ బిడ్డకు జన్మనివ్వడంతో నెలరోజుల పాటు సైఫ్ ఆదిపురుష్ షూటింగ్ కు బ్రేక్ తీసుకున్నాడు.

ఇటీవలే కరీనా పండంటి మగడబిడ్డకు జన్మనించింది. ప్రస్తుతం సైఫ్ ఆదిపురుష్ కోసం సిద్ధమయ్యారు. తాజాగా సైఫ్ న్యూలుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది.  న్యూ హెయిర్ కట్ తో సైఫ్ ను చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ లో సైఫ్ లుక్ ఇదే అని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైఫ్ న్యూ లుక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం. వచ్చే ఏడాది అంటే 2022 ఆగష్టు 11న ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jagapathi Babu and Aamani : ‘ఆహా’కోసం జగపతి బాబు వెబ్ సిరీస్.. జగ్గూభాయ్ కు జోడీగా అలనాటి అందాల నటి ఆమని

పచ్చని కాపురంలో చిచ్చు .భర్త బ్రాడ్ పిట్ గృహ హింసకు పాల్పడ్డాడంటూ కోర్టు కెక్కిన హాలీవుడ్ నటి ఏంజిలినా జోలీ,