Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చని కాపురంలో చిచ్చు .భర్త బ్రాడ్ పిట్ గృహ హింసకు పాల్పడ్డాడంటూ కోర్టు కెక్కిన హాలీవుడ్ నటి ఏంజిలినా జోలీ,

తన మాజీ భర్త , నటుడు బ్రాడ్ పిట్ గృహ హింసకు పాల్పడ్డాడంటూ హాలీవుడ్ నటి ఏంజిలినా జోలీ కోర్టుకెక్కింది. తన వాదనను నిరూపించుకోవడానికి 45 ఏళ్ళ ఈ నటి తన వద్ద  ఆధారాలు...

పచ్చని కాపురంలో చిచ్చు .భర్త బ్రాడ్ పిట్ గృహ హింసకు  పాల్పడ్డాడంటూ కోర్టు కెక్కిన  హాలీవుడ్ నటి ఏంజిలినా జోలీ,
Hollywood Actress Angelina Jolie Claims She Has  Proof Of Domestic Violance Against Brad Pitt
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 18, 2021 | 2:44 PM

తన మాజీ భర్త , నటుడు బ్రాడ్ పిట్ గృహ హింసకు పాల్పడ్డాడంటూ హాలీవుడ్ నటి ఏంజిలినా జోలీ కోర్టుకెక్కింది. తన వాదనను నిరూపించుకోవడానికి 45 ఏళ్ళ ఈ నటి తన వద్ద  ఆధారాలు కూడా ఉన్నాయంటూ వాటిని కోర్టుకు సమర్పించడానికి సిధ్దమని ప్రకటించింది. 57 ఏళ్ళ  తమ తండ్రి బ్రాడ్ పిట్ పై వాంగ్మూలం  ఇవ్వడానికి వీరి పిల్లలు కూడా అంగీకరించారని యూఎస్ లోని ఓ మేగజైన్ తెలిపింది. 2004 లో ‘మిస్టర్ అండ్ మిసెస్  స్మిత్’   మూవీ సందర్భంగా ఏంజిలినా జోలీ, బ్రాడ్ పిట్ కలుసుకున్నారు. 2014 లో వివాహం చేసుకోవడానికి ముందు కొన్నేళ్ల పాటు డేటింగ్ చేశారు. 2016 లో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఇద్దరూ విడిపోయి ఇక విడాకుల కోసం కోర్టుకెక్కారు. 2019  ఏప్రిల్ లో లీగల్ గా వీరు విడిపోయారని, సింగిల్ గా ఉంటున్నారని  కోర్టు ప్రకటించింది. ఈ జంటకు ఆరుగురు పిల్లలున్నారు. వీరంతా ఇంకా మైనర్లే..బ్రాడ్ పిట్ పిల్లల  పట్ల దురుసుగా ప్రవర్తించేవాడంటూ 2016 లో వచ్చిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఈ ఆరోపణలు నిరాధారమని ఎఫ్ బీ ఐ క్లియర్ చేసింది. పిల్లలను తాము పెంచుకుంటామంటే..తాము పెంచుకుంటామంటూ ఏంజిలినా జోలీ, బ్రాడ్ పిట్ ఇద్దరూ కూడా తగవులాడుకొంటూ వచ్చారట.

అయితే  ఏంజిలినా జోలీ ఆరోపణలకు ఆధారాలు లేవని బ్రాడ్ పిట్ తరఫు లాయర్లు అంటున్నారు. వీటిని ఆమె కోర్టులో నిరూపించాల్సి ఉందంటున్నారు.  ఈ ఆరోపణలు విచారణకు నిలవజాలవని వారు అభిప్రాయపడ్డారు. తమ క్లయింటును బాధ పెట్టడానికి ఆమె తన పిల్లలను వినియోగించుకుంటోందని వారు పేర్కొన్నారు. 2019 లో బ్రాడ్ పిట్ చివరిసారిగా ‘యాడ్ యాస్త్రా’,  ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’ చిత్రాల్లో నటించాడు.  ఈ రెండో సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా  ఆస్కార్ అవార్డు అందుకున్నాడు.  ‘బుల్లెట్ ట్రెయిన్’ అనే కొత్త సినిమాలో ఈయన,  పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ‘ఎటర్నల్స్’ అనే చిత్రంలో ఏంజిలినా కనిపించనున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ : కదులుతున్న కారులోంచి పడిపోయిన చిన్నారి..షాక్ అవుతోన్న నెటిజెన్ల : child fell out in running car video

అనుపమ గుండె ముక్కలైపోయిందా..? ఆ పోస్టులు బుమ్రాను ఉద్దేశించేనా.?Anupama post about bumrah marriage video

ఆ సెక్స్ డాల్‌ను పెళ్లి చేసుకొని ఇప్పుడు నచ్చలేదని విడాకులు ఇచ్చేశాడు : divorced to sex doll Video.