Jagapathi Babu and Aamani : ‘ఆహా’కోసం జగపతి బాబు వెబ్ సిరీస్.. జగ్గూభాయ్ కు జోడీగా అలనాటి అందాల నటి ఆమని

ఒకప్పుడు  ఫ్యామిలీ హీరోగా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు జగపతి బాబు. ముఖ్యంగా అమ్మాయిల్లో జగ్గూభాయ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా  గా ఒక వెలుగు వెలిగిన జగపతి బాబు. ఆతర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు.

Jagapathi Babu and Aamani : 'ఆహా'కోసం జగపతి బాబు వెబ్ సిరీస్.. జగ్గూభాయ్ కు జోడీగా అలనాటి అందాల నటి ఆమని
Aamani
Follow us

|

Updated on: Mar 18, 2021 | 3:19 PM

Jagapathi Babu and Aamani : ఒకప్పుడు  ఫ్యామిలీ హీరోగా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు జగపతి బాబు. ముఖ్యంగా అమ్మాయిల్లో జగ్గూభాయ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా  గా ఒక వెలుగు వెలిగిన జగపతి బాబు. ఆతర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఆతర్వాత విలన్ అవతరమెత్తి అందరిని భయపెట్టారు. నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమాలో జగపతి బాబు ప్రతి నాయకుడిగా నటించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతర్వాత అనేక ఆఫర్లు జగ్గూభాయ్ ని వెతుకుంటూ వచ్చాయి. లెజెండ్ సినిమా తర్వాత కేవలం విలన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఎన్నో సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమాలతోపాటు జగపతి బాబు వెబ్ సిరీస్ లోను నటిస్తూ అలరిస్తున్నారు.

ఇటీవల ‘పిట్టకథలు’ అనే వెబ్ సిరీస్ లో నటించారు జగపతి బాబు. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు తెలుగు ఓటీటీ సంస్థ అయిన ‘ఆహా’  కోసం మరో వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు జగపతి బాబు. అంతే కాదు ఈ వెబ్ సిరీస్ లో జగపతి బాబుకు జోడీగా అలనాటి అందాల నటి ఆమని కనిపించనున్నారు. ఆమని ఇటీవలే ‘చావు కబురు చాల్లాగా’అనే సినిమాలో కీలక పాత్రలో నటించారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ వస్తున్న ఆమని ‘చావు కబురు చాల్లాగా’ మూవీలో హీరో తల్లిగా నటించారు.

ఇక జగపతి బాబు ఆమనిలది హిట్ పెయిర్. ఈ ఇద్దరు కలిసి నటించిన ‘శుభలగ్నం’ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇటీవల ‘చావు కబురు చల్లగా’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. ‘ఆహా’ కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ సిరీస్ లో జగపతి బాబుకు జోడీగా నటిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో ఆమనీ బోల్డ్ గా నటించనున్నారంట. ఆహాలో త్వరలో ఆ ప్రాజెక్ట్ రాబోతున్నట్లుగా ఆమని పేర్కొన్నారు.  జగ్గూభాయ్, ఆమని పెయిర్ మరోసారి సందడి చేయడం ఖాయం అని తెలుస్తుంది.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో