AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramya Krishnan : హాట్ హాట్ ఫొటోతో కవ్విస్తున్న సీనియర్ హీరోయిన్.. కొంటె కామెంట్లతో ముంచెత్తుతున్న అభిమానులు.

సీనియర్ హీరోయిన్స్ లో గ్లామరస్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు రమ్యకృష్ణ. అందం అభినయం కలబోసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది రమ్యకృష్ణ. సీనియర్ హీరోలు అందరి సరసన నటించి అలరించింది ఈ సొగసరి.

Ramya Krishnan : హాట్ హాట్ ఫొటోతో కవ్విస్తున్న సీనియర్ హీరోయిన్.. కొంటె కామెంట్లతో ముంచెత్తుతున్న అభిమానులు.
Ramya Krishnan
Rajeev Rayala
| Edited By: Team Veegam|

Updated on: Mar 20, 2021 | 11:21 AM

Share

Ramya Krishnan : సీనియర్ హీరోయిన్స్ లో గ్లామరస్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు రమ్యకృష్ణ. అందం అభినయం కలబోసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది రమ్యకృష్ణ. సీనియర్ హీరోలు అందరి సరసన నటించి అలరించింది ఈ సొగసరి. హీరోయిన్ గానే కాకూండా ఆ మధ్య స్పెషల్ సాంగ్స్ లో ను మెరిసి ఆకట్టుకుంది.  హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత కొంత కాలం క్యారక్టర్ ఆర్టిస్ట్ గాను రాణించింది రమ్యకృష్ణ. అయితే దర్శక ధీరుడు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాలో శివగామిగా నటించి అందరిని ఆకట్టుకుంది.

ఇక బహుబలి సినిమాలో రమ్యకృష్ణ తప్ప మరొకరిని శివగామిగా ఉహించుకోలేంతగా అద్భుతంగా నటించి అలరించింది. ఇక ఈ సినిమాతో రమ్యకృష్ణ అంతర్జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సినిమాలతోనే కేకాకుండా సోషల్ మీడియాద్వారా కూడా రమ్యకృష్ణ అభిమానులకు దగ్గరగాఉంటుంది. తన సినిమా విషయాలతోపాటు హాట్ హాట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా రమ్యకృష్ణ పోస్ట్ చేసిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. స్విమింగ్ పూల్ లో సేదతీరుతూ.. సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. ఈ ఫోటోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు కురిపిస్తున్నారు. మీ అందం ఎప్పటికి తగ్గదు, వన్నెతగ్గని వయ్యారం, యంగ్ హీరోయిన్స్ కు గట్టి పోటీ అంటూ కొంటె కామెంట్లు చేస్తన్నారు. ప్రస్తుతం రమ్యకృష్ణ తన భర్త కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ సినిమాలో నటిస్తుంది. అలాగే నాగార్జున నటిస్తున్నా ‘సోగ్గాడే చిన్నినాయనా’  ప్రీక్వెల్ బంగార్రాజు సినిమాలో నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Trisha Krishnan : తమిళపొన్ను అభిమానులకు నిరాశ.. చెన్నై చంద్రం త్రిష 60వ సినిమాకు అనుకోని షాక్..

Saif Ali Khan in a new look : సైఫ్ అలీఖాన్ న్యూ లుక్.. ‘ఆదిపురుష్’ లో కనిపించేది ఇలానేనా..