Pushpa Movie: నేషనల్ లెవల్‌లో పుష్ప క్రేజ్‌కి మరో ఉదాహరణ.. నెట్టింట వైరల్ అవుతోన్న శ్రీవల్లి మరాఠి వెర్షన్..
Pushpa Movie: బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయిని మరోసారి జాతీయ స్థాయిలో మారుమోగేలా చేసిన చిత్రం పుష్పనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దేశ వ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా..

Pushpa Movie: బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయిని మరోసారి జాతీయ స్థాయిలో మారుమోగేలా చేసిన చిత్రం పుష్పనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దేశ వ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా సెన్సేషన్ విజయాన్ని సొంతం చేసుకుంది. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సినీ ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్‌తో పాటు పాటలు కూడా చాలా పాపులర్ అయ్యాయి. అన్ని భాషల్లోనూ దేవీ మ్యూజిక్‌కు ప్రేక్షకులకు ఫిదా అవుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమాలోని పాటలతో చేసిన రీల్స్ సోషల్ మీడియాలో హోరెతెత్తుతున్నాయి. ఇలా పాపులర్ యిన పాటల్లో శ్రీవల్లి సాంగ్ ఒకటి. తాజాగా ఇదే పాటకు పుణెకు చెందిన ఓ ట్రాఫిక్ పోలీస్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. అతీశ్ ఖరడే అనే ట్రాఫిక్ పోలీస్ ఏకంగా ఈ పాటకు మరాఠీలో లిరిక్స్ రాసి మరీ ఆలపించాడు. అంతటితో ఆగకుండా అచ్చం బన్నీలాగే స్టెప్స్ వేశాడు కూడా. ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి ఈ ట్రాఫిక్ పోలీస్ పాడిన పాటపై మీరూ ఓ లుక్కేయండి..
Also Read: Krithi Shetty: మరోసారి మెగా కాంపౌండ్‌లోకి బెబమ్మ.. కానీ ఈసారి ఇలా
Anasuya Bharadwaj: అనసూయ తమిళ్ మూవీ నయా పోస్టర్ చూశారా.. ఆకట్టుకుంటోన్న అందాల భామ..