Krithi Shetty: మరోసారి మెగా కాంపౌండ్‌లోకి బెబమ్మ.. కానీ ఈసారి ఇలా
వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార కృతిశెట్టి. తొలి సినిమాతోనే తన క్యూట్ లుక్స్, బబ్లీ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ చిన్నది
Updated on: Jan 15, 2022 | 10:06 PM

వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార కృతిశెట్టి. తొలి సినిమాతోనే తన క్యూట్ లుక్స్, బబ్లీ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ చిన్నది

. ఇప్పటికే నానితో శ్యామ్ సింగరాయ్, నాగచైతన్యతో బంగార్రాజు వంటి బడా చిత్రాల్లో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది.

ఇక వీటితో పాటు మరికొన్ని క్రేజీ మూవీస్‌కి శృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇదిలా ఉంటే తాజాగా కృతి మరో క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

తనకు ఇండస్ట్రీలోకి వెల్‌కమ్ చెప్పిన మెగా కాంపౌండ్‌లో మరోసారి శృతీ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈసారి మెగా హీరో సరసన కాకుండా, వారి నిర్మాణ రంగంలో నటించనుందని వార్తలు వస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఇటీవల నిర్మాతగా మారిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే సుస్మిత తాజాగా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం కృతిని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమచారం.