Kiran Abbavaram: జోరు పెంచిన కుర్ర హీరో.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా కిరణ్ అబ్బవరం
కుర్ర హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉన్నాడు.

కుర్ర హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో కిరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా తన ప్రొడక్షన్ నెం 1 గా కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా చేస్తున్నారు. కొత్త దర్శకుడు కార్తిక్ శంకర్ ని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు. రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్బుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని లహరి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో చిత్ర షూటింగ్ పూర్తి కానున్న ట్లు తెలిపారు దర్శక నిర్మాతలు. కిరణ్ అబ్బవరం మాస్ లుక్ లో అందర్ని ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా తోపాటు వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా చేస్తున్నాడు కిరణ్. ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురూ దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ప్రఖ్యాత దర్శకులు ప్రశాంత్ నీల్, కిషోర్ తిరుమల దగ్గర మురిళి కిషోర్ గతంలో పనిచేశారు. అలాగే గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సమ్మతమే అనే సినిమా చేస్తున్నాడు.




మరిన్ని సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి .




