AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thaman: ఆమెను నేను జడ్జ్ చేయలేకపోతోన్నాను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన మ్యూజిక్ సెన్సేషన్ తమన్..

100 శాతం తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ ఆహా(Aha).  సూపర్ హిట్ సినిమాలతో పాటు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు, అదిరిపోయే గేమ్ షోలు, ఆకట్టుకునే టాక్ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఆహా.

Thaman: ఆమెను నేను జడ్జ్ చేయలేకపోతోన్నాను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన మ్యూజిక్ సెన్సేషన్ తమన్..
Thaman
Rajeev Rayala
|

Updated on: Jun 11, 2022 | 11:17 AM

Share

100 శాతం తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ ఆహా(Aha).  సూపర్ హిట్ సినిమాలతో పాటు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు, అదిరిపోయే గేమ్ షోలు, ఆకట్టుకునే టాక్ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఆహా. అలాగే ప్ర‌పంచంలోనే బిగ్గెస్ట్ స్జేజ్ ప్రోగ్రామ్ తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌ను ఆహా నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ షోకు తమన్ , నిత్యామీనన్, కార్తీక్ జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. సంగీత ప్రియుల మధ్య గణనీయమైన ఆదరణ పొందిన ఇండియన్ ఐడల్ తెలుగు షో తుది అంకానికి చేరుకుంది. స్వర మాధుర్యంతో అలరించిన ఐదుగురు ఫైనలిస్టులతో ఓ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ సెన్సేషన్ తమన్(Thaman) మాట్లాడుతూ..

‘ఇలాంటి షోను ఓ టీంగా చేసినందుకు నాకు ఆనందంగా ఉంది. టీంగా మేం గెలిచాం. గత ఆరు నెలలుగా ఈ టీంతో ప్రయాణిస్తూ వచ్చాను అన్నారు. నాకు మాములుగా చాలా సిగ్గు. కానీ నేను ఎలా మారిపోయానో నాకే తెలియడం లేదు. ఆ స్పేస్ క్రియేట్ చేసిచ్చిన అరవింద్ గారికి థ్యాంక్స్. ఆయన నన్ను రెండు విషయాల్లో చాలా మార్చారు. నేను చాలా లో స్టేజ్‌లో ఉన్నప్పుడు సరైనోడు సినిమాను ఇచ్చారు. ఇది నీకు కరెక్ట్ సినిమా అని హోప్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇండియన్ ఐడిల్ చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం నాలోని ఇంకో కోణాన్ని చూస్తోంది. చాలా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఆ క్రెడిట్ అంతా కూడా అరవింద్ గారిదే అన్నారు తమన్. ఆహా కోసం నేను ముందు నుంచి పని చేస్తూనే ఉన్నాను. అల్లు అర్జున్ గారితో నాకు కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. రేసుగుర్రం, సరైనోడు, అల వైకుంఠపురములో వంటి సినిమాలున్నాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి థ్యాంక్స్.

జీవితంలో నాకు ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్. షోను అలా సరదాగా నడిపించిన శ్రీరామచంద్రకు థ్యాంక్స్. కార్తిక్ 8 వేల పాటలు పాడారని అంటారు. అవి బయటకు వచ్చినవి మాత్రమే. నలభై వేల స్క్రాచెస్ చేశారు. లక్షకు పైగా ప్రోగ్రాంలు ఇచ్చి ఉంటారు. గత 22 ఏళ్లుగా మేం స్నేహితులం. బాయ్స్ సినిమా అప్పటి నుంచి మాకు పరిచయం ఉంది. ఆయన తన కష్టంతోనే పైకి వచ్చారు. నిత్యా మీనన్ అద్భుతమైన పర్ఫార్మర్. షో మొత్తాన్ని జడ్జ్ చేయగలుగుతున్నా కానీ నిత్యాను జడ్జ్ చేయలేకపోతోన్నాను. 55 మంది సింగర్ల నుంచి  9 మంది.. 9 మంది నుంచి ఈ రోజు 5 మంది వరకు వచ్చారు. ఫ్రీమాంటల్ ఆహాలకు థ్యాంక్స్’అని తమన్ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని  సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..