Sivakarthikeyan: ప్రిన్స్‌గా రానున్న శివ కార్తికేయన్.. ఆకట్టుకుంటున్న నయా పోస్టర్

తమిళ్ హీరో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. శివ కార్తికేయన్  నటించిన రెమో సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది.

Sivakarthikeyan: ప్రిన్స్‌గా రానున్న శివ కార్తికేయన్.. ఆకట్టుకుంటున్న నయా పోస్టర్
Prince
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 11, 2022 | 7:52 AM

తమిళ్ హీరో శివ కార్తికేయన్(Sivakarthikeyan) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. శివ కార్తికేయన్  నటించిన రెమో సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. రెమో తర్వాత సీమరాజా, కౌసల్య కృష్ణమూర్తి వంటి చిత్రాలతో మెప్పించాడు.. ఇటీవల విడుదలైన వరుణ్ డాక్టర్ , కాలేజ్ డాన్ వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు నేరుగా తెలుగులో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జాతి రత్నాలు’ సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవి దర్శకత్వంలో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రిన్స్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటీవలే ‘ప్రిన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ తో ఆకట్టుకున్న యూనిట్ తాజాగా సినిమాలో కథానాయిక ర్యాబోషప్క ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క జంట గోడ పైన కూర్చుని హాయిగా నవ్వుతూ కనిపించారు. తెలుగు అర్ధం కాని ర్యాబోషప్క కు శివకార్తికేయన్ సుమతి శతకం భోదిస్తున్నట్లుగా ఉంటడం చాల ఆసక్తికరంగా వుంది. వీరిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. శివకార్తికేయన్ కూల్ అండ్ క్లాస్ గా, మరియా ర్యాబోషప్కా చాలా అందంగా కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లానే ఈ కొత్త పోస్టర్ కూడా పాజిటివ్ వైబ్స్ తో అలరించింది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 31న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ఇటీవల ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

Maria Ryaboshapka And Sivakarthikeyan