Karthikeya 2: కార్తికేయ సీక్వెల్‌ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. పాత్రలను పరిచయం చేసిన చిత్ర యూనిట్‌..

Karthikeya 2: నిఖిల్‌ హీరోగా 2014లో వచ్చిన 'కార్తకేయ' సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు...

Karthikeya 2: కార్తికేయ సీక్వెల్‌ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. పాత్రలను పరిచయం చేసిన చిత్ర యూనిట్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 11, 2022 | 7:30 AM

Karthikeya 2: నిఖిల్‌ హీరోగా 2014లో వచ్చిన ‘కార్తకేయ’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఓ దేవాలయంలో జరుగుతోన్న రహస్యాలను చేధించే క్రమంలో హీరో, అతని స్నేహితులు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారన్న కథాంశంతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కల్పించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

కార్తికేయ 2 పేరుతో రానున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ‘సముద్రం దాచుకున్న అతి పెద్ద ప్రపంచ రహస్యం.. ఈ ద్వారకా నగరం’ అనే థీమ్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రేక్షకుల్లో ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచేసింది. ఇప్పటికే దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై 22న విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌ను పెంచే పనిలో పడింది. ఇందులో భాగంగానే తాజాగా సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ సినిమాలో నిఖిల్‌ కార్తికేయగా, అనుపమ పరమేశ్వరన్‌ ముగ్ధ పాత్రలో, బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ధన్వంతరి పాత్రలో నటిస్తున్నారు. ఇక ఆదిత్యమీనన్‌, శాంతనుగా, సదానందగా శ్రీనివాస్‌ రెడ్డి, సులేమాన్‌ పాత్రలో వైవా హర్ష నటిస్తున్నారు. భారీ తారాగణంతో ఇంట్రెస్టింగ్ కథాంశంతో వస్తోన్న ఈ సినిమా జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరి కార్తికేయ అందుకున్న విజయాన్ని సీక్వె్ల్‌ బీట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే