AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhu Deva: ‘అవును.. ఆ వార్తలు నిజమే! ఈ వయసులో నేను మళ్లీ తండ్రయ్యాను’

ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా 50 ఏళ్ల వయసులో తండ్రి అయ్యాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఆయన రెండో భార్య హిమానీ తొలిసారి ఆడ బిడ్డకు జన్మనిచ్చిందనేది ఆ వార్తల సారాంశం. ఐతే ఈ వార్తలపై ప్రభుదేవా..

Prabhu Deva: 'అవును.. ఆ వార్తలు నిజమే! ఈ వయసులో నేను మళ్లీ తండ్రయ్యాను'
Prabhu Deva
Srilakshmi C
|

Updated on: Jun 12, 2023 | 5:24 PM

Share

ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా 50 ఏళ్ల వయసులో తండ్రి అయ్యాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఆయన రెండో భార్య హిమానీ తొలిసారి ఆడ బిడ్డకు జన్మనిచ్చిందనేది ఆ వార్తల సారాంశం. ఐతే ఈ వార్తలపై ప్రభుదేవా తాజాగా స్పందించాడు.’అవును, నా గురించి వస్తున్న వార్తలు నిజమే. 50 ఏళ్ల వయసులో నేను మరోసారి తండ్రయ్యాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా జీవితం పరిపూర్ణమైనట్లు అనిపిస్తోంది. ఇప్పటి వరకూ క్షణం తీరిక లేకుండా పని చేస్తూ వచ్చాను. ఇక చాలు. నా కుటుంబంతో కొంత సమయం గడపాలనుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు.

కాగా ప్రభుదేవా కుటుంబానికి ఇది అద్భుతమైన రోజని చెప్పుకోవాలి. తొలిసారి ఆడపిల్ల పుట్టడంతో ప్రభుదేవా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. మొదటి భార్య రామలత ద్వారా ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు. ఐతే కొన్నేళ్ల క్రితం పెద్దబ్బాయి మృతి చెందాడు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రభుదేవా, రామలతలు విడాకులు తీసుకున్నారు. నటి నయనతార వల్లే వారు విడాకులు తీసుకున్నట్లు ఆ మధ్య వార్తలు పుంకాను పుంకాలుగా వచ్చాయి. ఆ తర్వాత 2020లో ఫిజియోథెరపిస్ట్‌ హిమానీ సింగ్‌ను పెళ్లాడాడు. తాజాగా ఆమెకు పాప పుట్టింది. ప్రభుదేవా ఎక్కువగా ముంబై, చెన్నై ల మధ్య ప్రయాణం చేస్తుంటారు. ఈ రెండు సిటీల్లో దర్శకుడిగా, నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా వరుస ప్రాజెక్టుల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.