Tollywood: 44 ఏళ్ల వయసులో రూ.28 లక్షల బైక్ పై రైడింగ్ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా ?..
బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది.. ఇప్పటికీ వరుస అవకాశాలను అందుకుంటూ అగ్రకథానాయికగా కొనసాగుతుంది. అయితే షూటింగ్స్ నుంచి కాస్త విరామం దొరికితే చాలు బైక్ పై రైడింగ్ చేస్తుంటుంది. తమిళ్ స్టార్ హీరో అజిత్ మాదిరిగానే ఈ బ్యూటీకి సైతం బైక్ రైడింగ్ అంటే ఎంతో ఆసక్తి. తాజాగా రూ. 28 లక్షల ఖరీదైన బీఎండబ్ల్యూ బైక్ మీద రైడ్ స్టార్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా షేర్ చేసింది ఆ హీరోయిన్.

ఆమె వయసు 44.. అయినా ఇప్పటి కుర్ర హీరోయిన్లకు గట్టిపోటీనిస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది.. ఇప్పటికీ వరుస అవకాశాలను అందుకుంటూ అగ్రకథానాయికగా కొనసాగుతుంది. అయితే షూటింగ్స్ నుంచి కాస్త విరామం దొరికితే చాలు బైక్ పై రైడింగ్ చేస్తుంటుంది. తమిళ్ స్టార్ హీరో అజిత్ మాదిరిగానే ఈ బ్యూటీకి సైతం బైక్ రైడింగ్ అంటే ఎంతో ఆసక్తి. తాజాగా రూ. 28 లక్షల ఖరీదైన బీఎండబ్ల్యూ బైక్ మీద రైడ్ స్టార్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా షేర్ చేసింది ఆ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టరా ?.. తనే హీరోయిన్ మంజు వారియర్. తమిళ్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్. ఇటీవలే అజిత్ నటించిన తెగింపు సినిమాలో నటించింది. 44 ఏళ్ల వయసులోనూ తరగని అందంతో మయా చేస్తుంది ఈ బ్యూటీ.
హీరోయిన్ మంజు వారియర్.. తాజాగా తన ఫేవరేట్ బైక్ BMW R1250GS లైసెన్స్ పొందింది. ఈ అడ్వెంచర్ బైక్ ధర దాదాపు రూ. 21 నుంచి 28 లక్షలు ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ బైక్ పై రైడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. బైక్ పై ఫోజులిస్తూ దిగిన ఫోటోలను షేర్ చేసింది మంజు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.




ఇదిలా ఉంటే.. తమిళ్ స్టార్ హీరో అజిత్ తో కలిసి లడఖ్ కు బైక్ ట్రిప్ కు వెళ్లింది మంజు. ఆ సమయం నుంచి తాను బైక్ నడపాలనే కోరిక కలిగిందని పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇక ఆ తర్వాత బైక్ నడిపేందుకు లైసెన్స్ పొందింది. అదే విషయాన్ని మంజు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. మంజువారియర్ చివరగా.. వెల్లరి పట్టాన్ అనే సినిమాలో నటించింది. ఇందులో సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రలో నటించగా.. మహేష్ వెట్టియార్ దర్శకత్వం వహించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




