AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yatra 2: ‘ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకును’.. యాత్ర 2 మోషన్ పోస్టర్ రిలీజ్..

'నమస్తే బాబు.. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా నమస్తే.. నమస్తే ..' అంటూ ఆనాడు వైఎస్ మాట్లాడిన గొంతును మరోసారి ఈ వీడియోలో వినిపించారు డైరెక్టర్. ఇక ఆ తర్వాత.. "నేనెవరో ఇంకా ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. నేను విన్నాను నేను ఉన్నాను"

Yatra 2: 'ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకును'.. యాత్ర 2 మోషన్ పోస్టర్ రిలీజ్..
Yatra 2 Motion Poster
Rajitha Chanti
|

Updated on: Jul 08, 2023 | 12:41 PM

Share

Yatra 2: ‘ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకును’.. యాత్ర 2 మోషన్ పోస్టర్ రిలీజ్.. 2019లో ఎన్నికల సమయంలో వచ్చిన యాత్ర సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మలయాళ హీరో మమ్ముట్టి నటించారు. డైరెక్టర్ మహీ వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కథ ఆధారంగా యాత్ర 2 సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక శనివారం యాత్ర 2 మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఒక నిమిషం పాటు ఉన్న ఆ వీడియోలో.. యానిమేటెడ్ జగన్ నడుస్తూ ఉంటే బ్యాగ్రౌండ్ వాయిస్ వస్తుంటుంది.

‘నమస్తే బాబు.. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా నమస్తే.. నమస్తే ..’ అంటూ ఆనాడు వైఎస్ మాట్లాడిన గొంతును మరోసారి ఈ వీడియోలో వినిపించారు డైరెక్టర్. ఇక ఆ తర్వాత.. “నేనెవరో ఇంకా ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. నేను విన్నాను నేను ఉన్నాను” అంటూ జగన్ వాయిస్ ఓవర్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు ప్రాజెక్ట్ కె చిత్రానికి మ్యూజిక్ అందిస్తోన్న సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఆ వీడియోలో వచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది.

ఈ సినిమాను V సెల్యులాయిడ్స్, త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఇందులో వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. జగన్ పాదయాత్ర దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అయ్యి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో పూర్తవుతుందని గతంలో డైరెక్టర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే