Captain Miller: ధనుష్‌ కెప్టెన్‌ మిల్లర్‌పై కాపీ రైట్స్‌ ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన ప్రముఖ నటుడు

అరుణ్ మాతేశ్వరన్‌ దర్శకత్వంలో ధనుష్ హీరోఆ నటించిన సినిమా 'కెప్టెన్ మిల్లర్'. కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ మరో కీలక పాత్రలో మెప్పించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. త్వరలో తెలుగులోనూ రిలీజ్‌ కానుంది. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన కెప్టెన్‌ మిల్లర్‌ సినిమాపై ప్రశంసలు కూడా వస్తున్నాయి.

Captain Miller: ధనుష్‌ కెప్టెన్‌ మిల్లర్‌పై కాపీ రైట్స్‌ ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన ప్రముఖ నటుడు
Captain Miller Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 23, 2024 | 11:38 AM

అరుణ్ మాతేశ్వరన్‌ దర్శకత్వంలో ధనుష్ హీరోఆ నటించిన సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ మరో కీలక పాత్రలో మెప్పించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. త్వరలో తెలుగులోనూ రిలీజ్‌ కానుంది. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన కెప్టెన్‌ మిల్లర్‌ సినిమాపై ప్రశంసలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడీ సినిమాపై ఓ ప్రముఖ నటుడు, రచయిత సంచలన ఆరోపణలు చేశాడు. ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా తన మూవీని చూసి కాపీ కొట్టారని ప్రముఖ నటుడు, రచయిత వేల రామమూర్తి ఆరోపించారు. తన కథను దొంగిలించి ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా తీశారని ఆరోపించారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, రామమూర్తి మాట్లాడిన వేలు’ ‘కెప్టెన్ మిల్లర్’ తన కథ ‘పతు యానై’ నుండి కాపీ చేశారు. నా అనుమతి లేకుండా నా కథను ఉపయోగించుకున్నారు. ఇది చాలా అన్యాయం. దీనిపై నేను పోరాడతాను. డబ్బు కోసమో, పాపులారిటీ కోసమో నేను ఈ ఆరోపణలు చేయడం లేదు. నా కథను దొంగిలించి సినిమా తీశారని బాధగా ఉంది. నా అనుమతి లేకుండానే నా మేధో సంపత్తిని దొంగలించారు. ఈ విషయంపై తమిళ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేయబోతున్నాను. సంఘం అధ్యక్షుడు భారతిరాజు నాకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉంది’ అని చెప్పుకొచ్చారు.

వేలా రామమూర్తి తమిళంలో కొన్ని కథలు, నవలలు రాశారు. కొన్ని సినిమాలకు కథలు కూడా రాశారు. అతను కొన్ని ప్రముఖ తమిళ సినిమాలలో కూడా నటించాడు. ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రానికి అరుణ్ మాతేశ్వరన్‌ దర్శకత్వం వహించారు. సమాజంలోని అసమానతలను ఎదుర్కొని బ్రిటిష్ సైన్యంలో చేరిన ఒక దళిత యువకుడి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. తన వర్గానికి చెందిన ప్రజలను బ్రిటిష్‌ సైన్యం హింసించినప్పుడు వారికి ఎలా ఎదురుతిరిగాడు. భారతీయులను ఎలా ఏకం చేశాడన్నదే కెప్టెన్‌ మిల్లర్‌ సినిమా కథ. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. ధనుష్ సోదరుడి పాత్రలో శివన్న నటించారు.

ఇవి కూడా చదవండి

త్వరలో తెలుగులోనూ రిలీజ్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?