Lavanya Tripathi: “నా భర్త నాకు ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు”.. లావణ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. యంగ్ హీరోలందరి సరసన హీరోగా నటించిన లావణ్య సలాడ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక వరుణ్ లావణ్య పెళ్లి గత ఏడాది గ్రాండ్ గా జరిగింది. లావణ్య, వరుణ్ ఇద్దరు కలిసి రెండు సినిమాల్లో నటించారు. మిస్టర్ , అంతరిక్షం అనే సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించారు.

లావణ్య త్రిపాఠి మొన్నటివరకు టాలీవుడ్ లో ఓ చిన్న హీరోయిన్.. కానీ ఇప్పుడు మెగా కోడలు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఈ యంగ్ హీరోను పెళ్లి చేసుకొని మెగాకోడలుగా మారిపోయింది. అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. యంగ్ హీరోలందరి సరసన హీరోగా నటించిన లావణ్య సలాడ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక వరుణ్ లావణ్య పెళ్లి గత ఏడాది గ్రాండ్ గా జరిగింది. లావణ్య, వరుణ్ ఇద్దరు కలిసి రెండు సినిమాల్లో నటించారు. మిస్టర్ , అంతరిక్షం అనే సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించారు. మిస్టర్ సినిమా సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు.
అప్పటి నుంచి ఈ ఇద్దరూ సీక్రెట్ గా లవ్ చేసుకుంటూ వచ్చారు. వీరి ఎంగేజ్ మెంట్ కూడా చాలా తక్కువ మంది సమక్షంలో జరిగింది. అలాగే వీరి వివాహం ఇటలీలో అంగరంగవైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత లావణ్య సినిమాలకు దూరం అవుతుందని అంతా అనుకున్నారు కానీ ఈ అమ్మడు ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మిస్ పర్‌ఫెక్ట్ అనే వెబ్ సిరీస్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మెగా కోడలు అనే ట్యాగ్ తో పటు మెగా ఫ్యామిలీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. నాకు సినిమాలు, వెం సిరీస్ లు అని తేడా లేదు.. నచ్చిన కథలను ఎంచుకుంటూ సినిమాలు, సిరీస్ లు చేస్తాను అని అన్నారు లావణ్య. మిస్ పర్‌ఫెక్ట్ వెబ్ సిరీస్ తో పాటు ఓ రెండు సినిమాల్లోనూ నటిస్తున్నా అని తెలిపింది లావణ్య. అలాగే మెగా కోడలు అనే ట్యాగ్ తో బాధ్యతలు పెరిగాయి. అలాగే పెళ్లి తర్వాత సినిమాలు, పాత్రల ఎంపికలో వరుణ్ ఫ్యామిలీ తనకు ఎలాంటి ఆంక్షలు, కండీషన్స్ పెట్టలేదని తెలిపింది లావణ్య. నా భర్త కూడా ఇలాంటి పాత్రలే చేయాలి అని నాకు ఎలాంటి కండిషన్స్ పెట్టలేదని తెలిపింది. నా కంటూ కొన్ని హద్దులు ఉన్నాయి వాటిని దాటకుండా సినిమాలు చేస్తా అని చెప్పుకొచ్చింది లావణ్య.
లావణ్య త్రిపాఠి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




