Rana Daggubati : దగ్గుబాటి రానా నయా మూవీ కూడా రెండు భాగాలుగా రానుందా..?
మొన్న మధ్య విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆతర్వాత బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేశాడు. ఈ సిరీస్ పలు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ మంచి వ్యూస్ ను రాబట్టింది
దగ్గుబాటి హీరో రానా ప్రస్తుతం సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. గతంలో గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన రానా.. ఇప్పుడు స్పీడ్ తగ్గించారు. మొన్న మధ్య విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆతర్వాత బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేశాడు. ఈ సిరీస్ పలు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ మంచి వ్యూస్ ను రాబట్టింది. ఇక ఇప్పుడు ఆయన క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీ కానున్నాడు. గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్య కశ్యప సినిమా చేయాల్సి ఉంది. గతంలో ఈ మూవీ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ ఉసే లేదు. గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సినిమా డిజాస్టర్ అవ్వడంతో గుణశేఖర్ డైలమాలో పడ్డారు.
దాంతో హిరణ్య కశ్యప సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు తేజ దర్శకత్వంనలో ఓ సినిమా చేస్తున్నారు రానా. ఇటీవలే తేజ రానా తమ్ముడు అభిరామ్ తో కలిసి అహింస అనే సినిమా చేశారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఇక ఇప్పుడు రానాతో కలిసి రాక్షసరాజు అనే సినిమా చేస్తున్నాడు తేజ. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండనై తెలుస్తోంది. గతంలో తేజ, రానా కాంబినేషన్ లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రాక్షస రాజు సినిమాతో మరో సారి ఈఇద్దరు హిట్ కట్టాలని కసిగా ఉన్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.