YouTuber: రోడ్డు పై రెచ్చిపోయిన యూట్యూబర్.. బైకర్‌ను ఢీ కొట్టి పారిపోయిన ఘనుడు
ఇప్పటికే చాలా మంది యూట్యూబర్స్ గా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కొంతమంది నిజంగానే ఫెమస్ అవుతుంటే మరికొంతమంది మాత్రం మేమే ఫెమస్ అంటూ చెప్పుకుంటున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరు ఎందుకు ఫేమస్ అవుతున్నారో అర్ధంకావడం లేదు. యూట్యూబ్ లో ఒకొక్కరికి ఒకొక్క సొంత ఛానెల్స్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది యూట్యూబర్స్ గా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కొంతమంది నిజంగానే ఫెమస్ అవుతుంటే మరికొంతమంది మాత్రం మేమే ఫెమస్ అంటూ చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ యూట్యూబర్ చేసిన పని నెటిజన్స్ కు ఆగ్రహం తెప్పిస్తుంది. కళ్ళు నెత్తికెక్కిన ఒక యూట్యూబర్ చేసిన పనికి ఓ వ్యక్తి ప్రాణాలు పోయుండేవి.. యూట్యూబ్‌లో వీడియోలు చేసి ఫేమ వాసన్ ఒకరు. టీటీఎఫ్ వాసన్ యూట్యూబ్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్నాడు.
ఇక ఈ యూట్యూబర్ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కాదు గురూ.. ఏకంగా హీరోగానే మారిపోయాడు. మండల్ వీరన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ఈ యూట్యూబర్. ఇదిలా ఈ ఘనుడు ఓ రోడ్డు పై రాష్ డ్రైవ్ చేసి ఓ బైకర్ ను డాష్ ఇచ్చాడు.
ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారులో వేగంగా వెళ్తున్న వాసన్.. అదుపు చేసుకోలేక డివైడర్ ను ఢీ కొట్టాడు. ఆతర్వాత పక్కనే వెళ్తున్న బైకర్ ను ఢీ కొట్టాడు. దాంతో ఆ బైకర్ కింద పడిపోయాడు. దాంతో భయపడిన వాసన్ అక్కడి నుంచి పారిపోయాడు.