నిద్రలో మెడ, వెన్నెముక నొప్పికి చెక్ పెట్టడం ఎలా ?

నిద్ర మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. దిండు లేకుండా నిద్రించడం వల్ల శరీరానికి సహజమైన స్థితి కలిగిపోతుంది, దీని ద్వారా మెడ, వెన్నెముక నొప్పులు తగ్గుతాయి. దిండు సరైన ఎత్తులో ఉండకపోతే అనారోగ్యాలు, ముఖ్యంగా నడుం నొప్పి, వెన్నెముక సమస్యలు ఏర్పడవచ్చు. దీని నివారించడానికి తక్కువ ఎత్తు దిండు వాడడం, దిండు కరెక్ట్ పొజిషన్ లో ఉండేలా చూసుకోవడం అవసరం. అలా చేస్తే భవిష్యత్‌లో సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. సరైన దిండు ఎంపిక ఆరోగ్యకరమైన నిద్ర కోసం చాలా ముఖ్యం.

నిద్రలో మెడ, వెన్నెముక నొప్పికి చెక్ పెట్టడం ఎలా ?
Select Pillow For Best Sleep
Follow us
Prashanthi V

|

Updated on: Jan 13, 2025 | 3:00 PM

మనందరికి కూడా ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది నిద్ర. సరిపడినంత నిద్ర లేకపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. మనలో చాలా వరకు కూడా దిండు లేకుండా నిద్ర పోలేరు. కానీ దిండు ఉపయోగించడంలో కొన్ని తప్పులు జరగకుండా చూసుకోవాలి. పైగా కొంత మంది ఒక దిండు యూజ్ చేస్తారు. ఇంకొంత మంది రెండు దిండులను యూజ్ చేస్తారు. కానీ నిరంతరం దిండు వాడడం వల్ల ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో తెలుసుకోవాలి. దీని వల్ల అనారోగ్యాలు, ముఖ్యంగా మెడ, వెన్నెముక సమస్యలు రావచ్చు. ఆరోగ్య నిపుణులు కూడా ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

దిండు లేకుండా నిద్రిస్తే..!

దిండు లేకుండా నిద్రించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది నిద్రలో మీ శరీరానికి సహజమైన స్థితిని కలిగించడంలో సహాయపడుతుంది. దిండు ఎక్కువ ఎత్తులో లేకపోవడం వల్ల శరీరం, మెడ సహజంగా బాగుంటాయి. ఇది శరీరానికి విశ్రాంతిని కూడా ఇస్తుంది.

నడుం, మెడ నొప్పిని నివారించాలంటే

దిండు ఉపయోగించకపోవడం వల్ల నడుం నొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలను తగ్గించవచ్చు. దిండు పై ఎక్కువ ఆధారపడటంతో కొన్నిసార్లు ఈ సమస్యలు తీవ్రమవుతాయి. దిండు సహజ స్థితిలో ఉండడం అలర్జీలు, ఒత్తిడి వంటి అనేక సమస్యలను కూడా తగ్గించడంలో దోహదం చేస్తుంది.

తక్కువ ఎత్తున్న దిండు ఎంచుకోవడం

దిండు పూర్తిగా విడిచిపెట్టలేకపోతే, తక్కువ ఎత్తులో ఉండే దిండు ఎంచుకోవడం మంచిది. ఎక్కువ ఎత్తు కలిగిన దిండు ఉపయోగించడం వల్ల వెన్నెముకకు, మెడకు సమస్యలు రావచ్చు. కాబట్టి తగిన ఎత్తు కలిగిన దిండు ఎంచుకోవడం అవసరం.

భవిష్యత్తులో వచ్చే సమస్యలకు చెక్

చాలా కాలంగా ఎక్కువ ఎత్తు ఉన్న దిండు ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో మెడ, వెన్నెముకకు సంబంధించి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి దిండు కరెక్ట్ పొజిషన్ లో ఉండేలా చూసుకోవాలి. ఇది భవిష్యత్తులో కలిగే సమస్యలను తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.

పక్కకు తిరిగి పడుకునే వారికి హెచ్చరిక

మీరు పక్కకు తిరిగి నిద్రిస్తున్నప్పుడు దిండు ఎక్కువగా ఎత్తులో లేకుండా.. అదే విధంగా ఎక్కువగా తక్కువగా కూడా ఉండకూడదు. దిండు కరెక్ట్ పొజిషన్ లో ఉండేలా చూసుకోవడం మీకు నిద్రలో సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ జాగ్రత్తలతో మంచి నిద్ర మీ సొంతం అవుతుంది.

దిండు వాడకంలో ఈజీ టిప్స్

మంచి నిద్రకు అనుకూలమైన గది, సౌకర్యవంతమైన బెడ్, తగిన దిండు చాలా ముఖ్యమైనవి. దిండు ఎంచుకునేటప్పుడు అది మీ శరీరానికి తగ్గట్టుగా ఉండేలా చూసుకోవాలి. తగిన పద్ధతిలో దిండు ఉపయోగించడం ద్వారా మీరు మంచి ఆరోగ్యంతో పాటు, మంచిగా నిద్రిస్తారు.