- Telugu News Photo Gallery Cricket photos IPL 2025: Shreyas Iyer New Captain of Punjab Kings Announced Salman Khan Clarity on Big Boss Stage
Punjab Kings: పంజాబ్ కింగ్స్ తలరాత మార్చేది ఈయనే.. బిగ్ బాస్ వేదికగా సల్మన్ ఖాన్ సంచలన నిర్ణయం..
IPL 2025 Punjab Kings Captain: ఐపీఎల్ సీజన్ 17లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు నాయకత్వం వహించిన శ్రేయాస్ అయ్యర్‌ను ఈసారి పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. కెప్టెన్సీనే లక్ష్యంగా చేసుకుని అధిక బిడ్ ప్రైజ్‌తో శ్రేయాస్ అయ్యార్‌ను కొనుగోలు చేసిందని తెలుస్తోంది.
Updated on: Jan 13, 2025 | 2:40 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) సీజన్ 18కి పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కొత్త కెప్టెన్‌ని ఎంపిక చేసింది. బిగ్ బాస్ రియాల్టీ షోలో ఎంపికైన హీరో ప్రకటన వెలువడడం విశేషం.

అవును ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌కు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు. ఆదివారం నాటి హిందీ రియాల్టీ షో బిగ్ బాగ్ ఎపిసోడ్‌కు పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, శశాంక్ సింగ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ సమయంలో, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, బిగ్ బాస్ ప్రోగ్రామ్ హోస్ట్ శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ జట్టుకు తదుపరి కెప్టెన్ అని ప్రకటించారు. విశేషమేమిటంటే ఐపీఎల్ చరిత్రలో ఓ టీవీ షో ద్వారా కెప్టెన్‌ను ప్రకటించడం ఇదే తొలిసారి.

మార్కస్ స్టోయినిస్ పంజాబ్ కింగ్స్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ జట్టు కెప్టెన్‌గా స్టోయినిస్ కనిపించాడు. దీంతో మార్కస్ స్టోయినిస్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశం ఎక్కువగా ఉంది.

పంజాబ్ కింగ్స్ జట్టు: శ్రేయాస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, విజయ్‌కుమార్ వైషాక్, యశ్ ఠాకూర్, మార్కో జాన్సెన్, జోష్ ఇంగ్లిస్, లాకీ ఫెర్గూసన్, అజ్మతుల్లా ఒమర్జాహి, ఆరోన్ హార్డీ, ముషీర్ ఖాన్, సూర్యాంశ్, జేవియర్ బ్రాట్‌లెట్, పైలా అవినాష్, ప్రవీణ్ దూబే, నెహాల్ వధేరా, హర్నూర్ పన్ను, కుల్దీప్ సేన్.




