- Telugu News Photo Gallery Cricket photos Rishabh Pant and Yashasvi Jaiswal May Team India's Test Vice Captaincy Race
Team India: ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టిన బీసీసీఐ.. పంత్, జైస్వాల్ మధ్య భారీ పోరే జరగనుందా?
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే సిరీస్ లో టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్ మారడం దాదాపు ఖాయం. టీమిండియా తరపున నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లకు కెప్టెన్, వైస్ కెప్టెన్స్ చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయించగా, వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ లేదా యశవ్ జైస్వాల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చర్చించింది.
Updated on: Jan 13, 2025 | 4:47 PM

ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టులో కీలక మార్పలు జరగడం ఖాయం. టెస్టు జట్టు కెప్టెన్ మారనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అంటే, ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ నుంచి ప్రస్తుత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించడం దాదాపు ఖాయం.

రోహిత్ శర్మ జట్టుకు దూరమైతే కెప్టెన్‌గా ఎవరుంటారనే ప్రశ్నలు రావడం సహజం. ఈ ప్రశ్నకు ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లోనే సమాధానం లభించింది. అవును, ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా కనిపించే అవకాశం ఉంది.

గతంలో టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న బుమ్రాకు కెప్టెన్సీ అప్పగిస్తే.. టీమిండియా కొత్త వైస్ కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో భారత టెస్టు జట్టు తదుపరి వైస్ కెప్టెన్ ఎవరన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.

ఈ ఆసక్తికర ప్రశ్నకు ప్రస్తుతం ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ కీలకంగా వినిపిస్తున్నారు. ఆదివారం జరిగిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశంలో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లనే కెప్టెన్, వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయాలనే అభిప్రాయం వ్యక్తమైంది. అదే సమయంలో, రిషబ్ పంత్ లేదా యశస్వి జైస్వాల్‌కు వైస్ కెప్టెన్ టైటిల్ ఇవ్వడంపై చర్చ జరిగింది. అందువల్ల ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో యశస్వి జైస్వాల్ లేదా రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ లీడ్స్‌లో జరగనుండగా, రెండో టెస్టు మ్యాచ్‌కు బర్మింగ్‌హామ్ ఆతిథ్యం ఇవ్వనుంది. మూడో టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. నాలుగో మ్యాచ్‌కు మాంచెస్టర్ ఆతిథ్యం ఇవ్వగా, ఐదో మ్యాచ్ లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో జరగనుంది.




