AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వావ్ వాటే టాలెంట్ గురూ..రుమాలీ రోటీ తయారీలో మీకు మీరే సాటి..! వీడియో చూడాల్సిందే..

చాలా మంది ఈ వీడియోను లైక్ చేసారు. అయితే, కొందరు పరిశుభ్రతపై ప్రశ్నలు లేవనెత్తగా, మరికొందరు కలిసి కూర్చుని ఇంత పెద్ద రోటీ తినడం గురించి మాట్లాడారు. మొత్తానికి వీడియో మాత్రం విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు.

వావ్ వాటే టాలెంట్ గురూ..రుమాలీ రోటీ తయారీలో మీకు మీరే సాటి..! వీడియో చూడాల్సిందే..
12 Feet Long Rumali Rroti
Jyothi Gadda
|

Updated on: Jan 13, 2025 | 2:16 PM

Share

రెస్టారెంట్లు, వంటలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అవుతుంటాయి. వీటిలో వేల మందికి బిర్యానీ, వందల కిలోల చికెన్ కర్రీ తయారు చేయటం వంటి వీడియోలు బాగా పాపులర్. అయితే, అలాంటిదే కొన్ని రోజుల క్రితం షేర్ చేసిన రోటీ మేకింగ్ వీడియోని కూడా జనాలు లైక్ చేసారు. ఇందులో ఓ వ్యక్తి ఎలాంటి సహాయం లేకుండా తన చేతులతో 12 అడుగుల భారీ రోటీని తయారు చేశాడు.. ఎలాంటి కొత్త టెక్నాలజీ లేకుండా పాత పద్ధతిలో నిప్పులపై ఆ రోటీ బేక్‌ చేసి తయారు చేశాడు. సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పటికీ, అలాంటి సాంప్రదాయ పద్ధతులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని వీడియో చూసిన చాలా మంది రాశారు.

అయితే, ఇలా చేతులపై రోటీని తయారుచేసే పద్ధతి చాలా సులభమైనదే. కానీ ఈ రోటీ పరిమాణం చాలా పెద్దది. ఈ వీడియోను ‘U క్రియేట్ జీ’ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ షేర్ చేసింది. ఇది పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్‌గా తెలిసింది.

ఇవి కూడా చదవండి

బన్నూ వివాహ వేడుకలో భాగంగా రూపొందించిన అతిపెద్ద ‘రుమాలి రోటీ’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ చేయబడింది. నేలపై పరిచిన గుడ్డపై కూర్చుని, ఒక యువకుడు తన చేతులతో పిండిని కొడుతూ పెద్దదిగా చేశాడు. చివరగా, దానిని ఒకరి తలపై తిప్పినప్పుడు, రోటీ సుమారు 12 అడుగుల పొడవు అవుతుంది. అప్పుడు అతను దానిని సమీపంలో ఉంచిన ఐరన్ ప్యాన్ వేసి కాల్చాడు.  దాని లోపల మంట మండుతోంది. ఆ తర్వాత అతను మరో రోటీ కోసం పిండిని చుట్టడం ప్రారంభిస్తాడు.

చాలా మంది ఈ వీడియోను లైక్ చేసారు. అయితే, కొందరు పరిశుభ్రతపై ప్రశ్నలు లేవనెత్తగా, మరికొందరు కలిసి కూర్చుని ఇంత పెద్ద రోటీ తినడం గురించి మాట్లాడారు. మొత్తానికి వీడియో మాత్రం విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..